iPhone 16e Price : అదిరిపోయే ఆఫర్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16e ధర.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16e Price : ఐఫోన్ కొంటున్నారా? రూ. 52వేల లోపు ధరకే ఐఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఆఫర్లు, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 16e Price : కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? మీరు ఐఫోన్ 16e మోడల్ సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్ A18 చిప్ టెక్నాలజీ కలిగి ఉంది.
అమెజాన్ నుంచి ఈ ఐఫోన్ మోడల్‌ను అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఐఫోన్ 16e ధర మరింత తగ్గుతుంది.
Read Also : Hallmark Gold : మీరు కొనే బంగారం మంచిదేనా? స్వచ్ఛత ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!
ఐఫోన్ 16e ధర, ఆఫర్లు :
128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 55,900గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ 9శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఐఫోన్ 16e ధర రూ. 54,100 అవుతుంది.
బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. అన్ని బ్యాంక్ కార్డులపై రూ.4వేలు తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.52,600 తగ్గింపు లభిస్తోంది. రూ.4509 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందొచ్చు.
ఐఫోన్ 16e ఫీచర్లు :
ఐఫోన్ 16e ఫీచర్లలో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 మాదిరిగా నాచ్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ A18 చిప్‌తో వస్తుంది. 8GB ర్యామ్ కూడా అందిస్తోంది.
కొత్త C1 మోడెమ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది. USB-C పోర్ట్‌తో కస్టమైజడ్ యాక్షన్ బటన్ కలిగి ఉంది. ఏఐ ఫీచర్లను కూడా అందిస్తోంది.