Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. మడతబెట్టే ఫోన్ మీకోసమే.. ఏకంగా రూ. 12వేలు తగ్గింపు..!
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కావాలా? శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రూ. 12వేలు తగ్గింది.

Samsung Galaxy Z Flip 6
Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫోల్డబల్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ (Samsung Galaxy Z Flip 6) తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
Read Also : iPhone 16e Price : అదిరిపోయే ఆఫర్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16e ధర.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో మరింత డిస్కౌంట్ ఆకర్షణీయంగా చేస్తుంది. ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్‌లు క్లామ్‌షెల్ లాంటి ఫోన్‌పై రూ. 12వేలు ఆదా చేయవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర రూ.90వేలుగా ఉంది.
డ్యూయల్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా, ప్రీమియం డిజైన్, అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర :
శాంసంగ్ గెలాక్సీ Z 6 5G ధర రూ.79.889కి అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.89,999 నుంచి తగ్గింది. HDFC ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. రూ.78వేల కన్నా తక్కువకే తీసుకోవచ్చు. నెలకు రూ.3,873 నుంచి నో-కాస్ట్ ఈఎంఐతో పాటు ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
పాత ఫోన్ రూ.68,850 వరకు ఎక్స్ఛేంజ్ చేయొచ్చు. వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు శాంసంగ్ కేర్ ప్లస్, ఎక్స్‌టెండెడ్ వారంటీతో పాటు యాడ్-ఆన్‌గా కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. 3.4-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీతో వస్తుంది. వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 10MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.