Aadhaar Update
Aadhaar Update Online : ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా? అతి త్వరలో ఆధార్ కార్డు వివరాలను ఇంటి వద్దనే ఉండి మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఆధార్ (Aadhaar Update) కార్డులోని చాలా వివరాలను అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, నవంబర్ 2025 నుంచి అలా ఉండదు.
ఆధార్ కార్డుదారులు ఇంటి నుంచి అనేక ముఖ్యమైన వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ ఆధార్ సర్వీసులను మరింత సౌకర్యవంతంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి లేదా రాకపోకలలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ కొత్త విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏయే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చంటే? Aadhaar Update :
ఇప్పటివరకు, ఆధార్ హోల్డర్లు (myAadhaar) పోర్టల్‌లో పేరు (చిన్న మార్పులు), ఇంటి అడ్రస్, జెండర్, పుట్టిన తేదీ (నిర్దిష్ట పరిమితి) వంటి వివరాలను అప్‌డేట్ చేయగలరు. కానీ, నవంబర్ 2025 నుంచి ఈ పరిధి మరింత విస్తరించనుంది. UIDAI అధికారుల ప్రకారం.. ఇప్పుడు ఆధార్ కార్డులో కొన్ని ముఖ్యమైన వివరాలను ఆన్‌లైన్‌లో కూడా మార్చుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్‌డేట్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? Aadhaar Update :
కొన్ని సందర్భాల్లో, పేరు లేదా పుట్టిన తేదీలో పెద్ద మార్పులు వంటివి, వీడియో వెరిఫికేషన్ అవసరం కావచ్చు. అన్ని ఆమోదించాక అప్‌డేట్ చేసిన డిజిటల్ ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ 3 రోజుల నుంచి 5 రోజుల్లోగా ప్రాసెస్ చేస్తామని UIDAI చెబుతోంది.
ఇవి తప్పక గుర్తుంచుకోవాలి Aadhaar Update :
కోవిడ్ నుంచి డిజిటల్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో రద్దీని తగ్గించేందుకు UIDAI ఆన్‌లైన్ అప్‌డేట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఇప్పటివరకు 140 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. కోట్లాది మంది ప్రజలు ఆధార్ ద్వారా ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, మొబైల్ సర్వీసులను పొందుతున్నారు.