FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? హై రిటర్న్స్ అందించే టాప్ 10 బ్యాంకులివే.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందంటే?

FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులేంటో తెలుసా? FDపై భారీ వడ్డీని అందించే 10 బ్యాంకులు వివరాలు ఇలా ఉన్నాయి..

FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? హై రిటర్న్స్ అందించే టాప్ 10 బ్యాంకులివే.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందంటే?

FD Rates

Updated On : July 7, 2025 / 11:08 AM IST

FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. అనేక బ్యాంకులు ఫిక్సడ్ డిపాజిట్లపై అద్భుతమైన రాబడిని (FD Rates) అందిస్తున్నాయి. దేశంలోని అనేక పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల కోసం FDపై భారీ రాబడిని అందిస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన కస్టమర్లు ఈ బ్యాంకుల నుంచి గరిష్టంగా 8.30 శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఉన్నాయి. FDపై కస్టమర్లకు అత్యధిక వడ్డీని అందిస్తున్న 10 బ్యాంకుల పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

SBI బంపర్ రాబడి :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సాధారణ కస్టమర్లకు FDలపై 3 శాతం నుంచి 7.10 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వడ్డీని అందిస్తోంది. HDFC బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, ICICI బ్యాంక్ సాధారణ కస్టమర్లకు FDలపై 3 శాతం నుంచి 7.10 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వడ్డీని అందిస్తోంది.

Read Also : Reliance Jio : మీకు డేటా అవసరం లేదా? జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

ఏ బ్యాంకులో అత్యధిక వడ్డీ ఎంతంటే? :
IDBI బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 6.75 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.25 శాతం నుంచి 7.70 శాతం వడ్డీని అందిస్తోంది. RBL బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.80 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 4 శాతం నుంచి 8.30 శాతం వడ్డీని అందిస్తోంది.

PNB 7.75 శాతం వరకు అధిక వడ్డీ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FD)పై 3.50 నుంచి 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 4 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. కెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు FDపై 4 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.10 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు FDపై 3.50 శాతం నుంచి 7.85 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.05 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.55 శాతం వడ్డీని అందిస్తోంది.