Acer Nitro V 16 Launch : గేమింగ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఏసర్ నిట్రో వి16 ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Acer Nitro V 16 Launch : ఈ కొత్త ల్యాప్‌టాప్ ప్రత్యేకించి గేమర్‌లు, క్రియేటర్ల కోసం రూపొందించింది. ఏసర్ నిట్రో వి16 విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. ఐపీఎస్ టెక్నాలజీతో 16-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

Acer Nitro V 16 With 14th Gen Intel Core CPU ( Image Source : Google )

Acer Nitro V 16 Launch : భారత మార్కెట్లో ఏసర్ నిట్రో వి 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ ప్రత్యేకించి గేమర్‌లు, క్రియేటర్ల కోసం రూపొందించింది. 14వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్‌లతో రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో కూడా అమర్చారు. ఏసర్ నిట్రో వి16 16-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను కలిగి ఉంది. 512జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. వై-ఫై 6, థండర్‌బోల్డ్ 4 వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది.

భారత్‌లో ఏసర్ నిట్రో వి 16 ధర ఎంతంటే? :
ఇంటెల్ కోర్ ఐ5 14450HX సీపీయూతో కూడిన ఏసర్ నిట్రో వి 16 ధర రూ. 99,999 అయితే, ఇంటెల్ కోర్ ఐ7 14650HX సీపీయూతో వేరియంట్ ధర రూ. 1,09,999కు పొందవచ్చు. ఏసర్ ఆన్‌లైన్ స్టోర్, ఏసర్ ప్రత్యేకమైన స్టోర్‌లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయానికి వస్తుంది.

ఏసర్ నిట్రో వి 16 స్పెసిఫికేషన్‌లు :
ఏసర్ నిట్రో వి16 విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. ఐపీఎస్ టెక్నాలజీతో 16-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గ్లేర్‌ను తగ్గించడానికి డిస్‌ప్లే కామ్‌ఫైవ్యూ ఎల్ఈడీ-బ్యాక్‌లిట్ టీఎఫ్టీ ఎల్‌సీడీతో అమర్చింది. ఏసర్ నిట్రో వి 16ని 14వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 14650HX లేదా ఇంటెల్ కోర్ ఐ5 14450HX ప్రాసెసర్‌లతో కాన్ఫిగర్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 6జీబీ జీడీడీఆర్6 విర్యామ్‌తో నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్4050 జీపీయూతో వస్తుంది. మీరు 512జీబీ వరకు పీసీఐఈ జనరేషన్ 4 ఎస్ఎస్‌డీ స్టోరేజీని కూడా పొందవచ్చు.

ఏసర్ నిట్రో వి 16లో అంబర్ బ్యాక్‌లైటింగ్‌తో కూడిన ఫుల్ సైజ్ న్యూమరిక్ కీప్యాడ్‌ను కలిగి ఉంది. మల్టీ-సైన్ టచ్‌ప్యాడ్‌ను కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఫర్మ్‌వేర్ టీపీఎమ్ సొల్యూషన్‌లకు ఎమ్ఎస్ఎఫ్‌టీ ప్లూటన్ సెక్యూరిటీ ప్రాసెసర్, కెన్సింగ్టన్ లాక్ స్లాట్‌తో వస్తుంది. 3-మైక్రోఫోన్ రేంజ్ ద్వారా ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉపయోగించుకునే ఏసర్ ప్యూరిఫైడ్ వాయిస్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

ఇంకా, ల్యాప్‌టాప్ కోపైలట్ అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం ఏసర్ ఇంటర్నల్ ట్రూహర్మనీ టెక్నాలజీని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఏసర్ నిట్రో వి 16 యూఎస్‌బీ 3.2 జనరేషన్ 2 పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ 2.1, థండర్‌బోల్ట్ 4, ఈథర్నెట్ (ఆర్‌జె-45) పోర్ట్‌లను కలిగి ఉంది. వై-ఫై 6 సపోర్టు కూడా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 2.5 కిలోగ్రాములు ఉంటుంది.

Read Also : Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?