After IPL 2023, JioCinema will stream Big Boss OTT 2 for free starting June 17
JioCinema stream Bigg Boss OTT 2 for free : ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ విజయవంతంగా ముగిసింది. అయినప్పటికీ, జియోసినిమా (JioCinema) ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జియోసినిమాలో OTT ప్రేక్షకులను అంటిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని IPL మ్యాచ్‌ల ఉచిత లైవ్ స్ట్రీమింగ్‌ను అందించిన జియోసినిమా.. ఇప్పుడు ఏకంగా, బిగ్‌బాస్ OTT సీజన్ 2 షోను 24×7 హోస్ట్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.
అందిన సమాచారం ప్రకారం.. జూన్ 17 నుంచి ప్రముఖ రియాలిటీ షో లైవ్ స్ట్రీమింగ్ ప్రదర్శిస్తుందని జియోసినిమా ప్రకటించింది. మల్టీ-కామ్ ద్వారా ఉచితంగా స్ట్రీమింగ్ అందించనుంది. బిగ్ బాస్ OTT 2 కొత్త సీజన్‌ను బుల్లితెర ప్రేక్షకుల కోసం మరింత ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు జియో కొత్త ఫీచర్‌లను కూడా ప్రవేశపెడుతోంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అనేక కొత్త ఫీచర్లను యాడ్ చేయనున్నట్టు ప్రకటించింది. బిగ్‌బాస్ ప్రేక్షకులు గేమ్‌పై మరింత ఆసక్తిని కలిగించేలా అనుమతిస్తుంది.
కంపెనీ ప్రకారం, జియోసినిమాలో బిగ్‌బాస్ OTT సీజన్ 2 స్ట్రీమింగ్ లైవ్ ఇంటరాక్టివిటీ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది. తద్వారా టీవీ వీక్షకులు బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది. వారంవారీ రేషన్, స్పాట్ ఎలిమినేషన్‌లు, టాస్క్ నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను రూపొందించగల సామర్థ్యాన్ని పొందవచ్చు.
అదనంగా, జియోసినిమా మల్టీ-కెమెరా స్ట్రీమింగ్‌తో లీనమయ్యే OTT ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే ప్రతి ఆసక్తికరమైన కంటెంట్ మిస్ కాకుండా చూసేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు.. జియోసినిమా లైవ్ స్ట్రీమింగ్ వీక్షకులకు 1000 గంటల లైవ్ కంటెంట్‌తో పాటు ఇంటి లోపల 360-డిగ్రీల కెమెరా వ్యూను అందిస్తుంది.
జూన్ 17 నుంచే బిగ్‌బాస్ OTT హిందీ రెండో సీజన్ :
ఇంటి నుంచి ప్రత్యేకమైన కట్‌లు, రౌండ్-ది-క్లాక్ కంటెంట్ డ్రాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా, వ్యూయర్లు లైవ్ చాట్‌లు, ఎమోజీల ద్వారా రియల్ టైమ్‌లో రెస్పాండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతి ఫుటేజ్ కంటిన్యూ మిస్ కాకుండా చూడవచ్చు.
After IPL 2023, JioCinema will stream Big Boss OTT 2 for free starting June 17
వచ్చే జూన్ 17న జియోసినిమాలో బిగ్‌బాస్ OTT హిందీ రెండో సీజన్ ప్రారంభమవుతుంది. అత్యంత జనాదరణ పొందిన షోలు లేదా మ్యాచ్‌లను (JioCinema) ఉచిత స్ట్రీమింగ్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, జియోసినిమా FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022, IPL 2023 లైవ్ స్ట్రీమింగ్ అందించి అత్యధిక వ్యూయర్లతో రికార్డులను బద్దలు కొట్టింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో జియోసినిమా ప్లాట్‌ఫారమ్ రియల్ టైమ్ వ్యూయర్ల సంఖ్య 44.9 కోట్లకు చేరుకుంది.
ఇంతకుముందు, జియోసినిమా, భారతీయ యూజర్ల కోసం ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ ధర రూ.999గా ప్రకటించింది. జియోసినిమా ప్రీమియంతో, ప్లాట్‌ఫారమ్ యూజర్లకు అందుబాటులో ఉన్న అన్ని HBO, WBD కంటెంట్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. Fifa, IPL, Bigg Boss OTT వంటి ఈవెంట్‌లను ప్రసారం చేయడం ద్వారా ట్రెండింగ్ ఇంటర్నేషనల్ కంటెంట్‌తో కూడిన ప్రత్యేకమైన డిజిటల్ లైబ్రరీని కలిగింది.
తద్వారా జియోసినిమా అత్యంత పోటీతత్వం ఉన్న OTT ప్లాట్ ఫారంలో తన ఉనికిని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫారాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రధాన ప్లేయర్‌లతో పోటీ పడేందుకు జియోసినిమా పోటీపడుతోంది. ప్రముఖ ప్రాజెక్ట్‌ల స్ట్రీమింగ్ ద్వారా లేటెస్ట్, అత్యంత జనాదరణ పొందిన మూవీలు, టీవీ షోలను చూడాలని కోరుకునే మరింత మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించాలని జియోసినిమా భావిస్తోంది.
Read Also : iQOO Neo 7 Pro : 50MP కెమెరాతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?