New Tata Nexon EV : కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ ఈవీ కారు వచ్చేస్తోంది.. హ్యుందాయ్, మహీంద్రా, మారుతీలకు దబ్బిడి దిబ్బిడే..!

New Tata Nexon EV : టాటా మోటార్స్ నుంచి సరికొత్త మోడల్ ఈవీ కారు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనుంది.

New Tata Nexon EV : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఈ (సెప్టెంబర్) నెల 7న ఎలక్ట్రిక్ నెక్సాన్ EV మిడ్-లైఫ్ మేక్ఓవర్‌ను అందుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి వెహికల్ టీజర్‌ను రివీల్ చేసింది. టాటా నెక్సాన్ EV ICE నెక్సాన్ ఆధారంగా రూపొందించింది. అదే డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. గత మోడల్ కార్లతో పోలిస్తే.. డిజైన్ లుక్ సరికొత్తగా ఉండనుంది. ఈ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కారు.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 300 కార్లకు పోటీగా రానుంది.

ఆకర్షణీయమైన మార్పులతో నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ :
లేటెస్ట్ టీజర్ పరిశీలిస్తే.. రాబోయే టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ కొన్ని అద్భుతమైన మార్పులతో రానుంది. Nexon ఫేస్‌లిఫ్ట్ మాదిరి స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో అదే కొత్త ఫ్రంట్-ఎండ్‌ను కూడా కలిగి ఉంటుంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్స్, ఎక్స్ టీరియర్స్ అనేక మార్పులు ఉండనున్నాయి. పూర్తి స్థాయిలో స్పోర్టీ లుకింగ్‌తో రానుంది. అడ్డంగా LED స్ట్రిప్‌ని కలిగి ఉండి.. పైన DRLలను కనెక్ట్ చేస్తుంది. బ్యాటరీతో నడిచే నెక్సాన్‌లో ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర మార్పులలో కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త కనెక్ట్ అయిన LED టెయిల్ లైట్లు, రీడిజైన్ బ్యాక్ బంపర్, అలాగే ఫ్లోటింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన ప్రీమియం క్యాబిన్ ఉంటుంది. అదే సైజులో ఉన్న ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు మధ్య లోగోతో స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త టచ్ HVAC కంట్రోల్స్, కొద్దిగా అప్‌డేట్ చేసిన సెంటర్ కన్సోల్ ఉన్నాయి.

Read Also : BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ సిరీస్ కారు.. సెప్టెంబర్ 7న వచ్చేస్తోంది.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి..!

రెండు సరికొత్త వేరియంట్లలో నెక్సాన్ ఈవీ :
ప్రస్తుతానికి, టాటా మోటార్స్ (Nexon EV)ని రెండు వేరియంట్లలో అందిస్తోంది. అందులో Nexon EV Prime, Nexon EV Max, రెండోది లాంగ్-రేంజ్ వెర్షన్ అందించనుంది. టాటా మోటార్స్ కంపెనీ ఈ ఫార్ములాను కొనసాగిస్తుందా? లేదా రెండింటినీ వేర్వేరు వేరియంట్ల రూపంలో అందిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ EV మ్యాక్స్ 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 453 కి.మీల పరిధిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 141HP పవర్, 250Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. సొగసైన గ్రిల్‌కు సీక్వెన్షియల్ LED DRLలు ఉన్నాయి.

డ్యూయల్-ఫంక్షనల్ LED హెడ్‌ల్యాంప్‌లు స్మార్ట్‌గా కనిపిస్తాయి. ఫ్రంట్ బంపర్ డిజైన్, హెడ్‌ల్యాంప్‌ల చాలా వివరాలు ఉన్నాయి. వెనుక వైపున, చాలా కొత్త కార్లలో కనిపించే విధంగా కనెక్ట్ చేసిన డిజైన్ టెయిల్‌ల్యాంప్‌లను అందిస్తోంది.వాహనం సరికొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కనిపిస్తుంది. డ్యూయల్-టోన్ రూఫ్ స్పోర్టి కోటీని ఎలివేట్ చేసేలా ఉంది. క్యాబిన్ లోపల, లెదర్ మిడ్-ప్యాడ్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీతో 3-టోన్ డ్యాష్‌బోర్డ్‌ను చూడవచ్చు. మధ్యన లెథెరెట్ ఆర్మ్‌రెస్ట్‌తో వెంటిలేటెడ్ లెథెరెట్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, IRA 2.0 కనెక్టివిటీ టెక్‌ని కలిగి ఉంది. ఫుల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫంక్షనాలిటీలను ఆపరేట్ చేసేలా కెపాసిటివ్ టచ్ ప్యానెల్ ఉంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో నావిగేషన్ డిస్‌ప్లే అయ్యేలా ఆసక్తికరమైన ఫీచర్ కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.

After Nexon facelift, new Tata Nexon EV to be unveiled on this date_ What to expect

గ్లోబల్ NCAP ఫైవ్-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను సాధించేందుకు భారత మార్కెట్లో తయారైన మొట్టమొదటి కారుగా చెప్పవచ్చు. వాహనం ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లో 6ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, TPMS, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర (అంచనా) :
Tata Nexon 2023 (Revotron) 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS/170Nm), Revotorq 1.5-లీటర్ డీజిల్ (115PS/260Nm) ఇంజిన్ సర్వీసులను కొనసాగిస్తోంది. ఇంతకుముందు, పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT ఎంపికలను కలిగి ఉండగా, కొత్త చేర్పులతో 5-స్పీడ్ MT, 7-స్పీడ్ DCA రూపంలో వచ్చాయి. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT ఆప్షన్లతో కొనసాగుతుంది. వాహనం గ్రౌండ్ క్లియరెన్స్ 1 మి.మీ తగ్గి 208 మి.మీ పెరిగింది.

అయితే, బూట్ స్పేస్ గణనీయంగా 350 లీటర్ల నుంచి 382 లీటర్లకు పెరిగింది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 11 వేరియంట్‌లలో వస్తోంది. అందులో క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S, ప్యూర్, ప్యూర్ S, స్మార్ట్, స్మార్ట్+, స్మార్ట్+ S ఉన్నాయి. టాటా నెక్సాన్ 2023 ధర ఎంత అనేది ఈ నెలాఖరులో రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ ఉంటుందని అంచనా.

Read Also : Apple iPhone 15 Launch Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్ డేట్ తెలిసిందోచ్.. కొత్త ఐఫోన్లతో పాటు మరెన్నో ప్రొడక్టులు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు