BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ సిరీస్ కారు.. సెప్టెంబర్ 7న వచ్చేస్తోంది.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి..!

BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ కారు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 7న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.

BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ సిరీస్ కారు.. సెప్టెంబర్ 7న వచ్చేస్తోంది.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి..!

BMW 2 Series Gran Coupe M Performance Edition launch

BMW 2 Series Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) నుంచి సరికొత్త సూపర్ BMW 2 సిరీస్ గ్రాన్ కూపే M పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ (BMW 2 Series Gran Coupe M Performance Edition)ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Read Also : Moto G54 5G Launch Date : మోటో G54 5G ఫోన్ వస్తోంది.. సెప్టెంబర్ 5నే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

బీఎండబ్ల్యూ కొత్త కారు ధర ఎంత ఉండొచ్చుంటే? : 

ఈ కొత్త కారు కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. రూ. 1.50 లక్షలతో BMW ఆన్‌లైన్ షాప్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు. బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్‌వర్క్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. BMW 220i M పెర్ఫార్మెన్స్ ఎడిషన్ భారతీయ మార్కెట్లో లిమిటెడ్ యూనిట్లను కలిగి ఉంది. అయితే, BMW ఇండియా ఆఫర్ చేసే కారు కచ్చితమైన సంఖ్యను పేర్కొనలేదు.

BMW 2 Series Gran Coupe M Performance Edition launch

BMW 2 Series Launch Gran Coupe M Performance Edition Bookings 

BMW 2 సిరీస్ గ్రాన్ కూపే M పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌లో BMW ట్విన్‌పవర్ టర్బో 2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 176hp గరిష్ట శక్తిని, 280Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ కారు 7.1 సెకన్లలో 0-100 కి.మీల వేగాన్ని అందుకోగలదు.

BMW 220i M పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌లో M పెర్ఫార్మెన్స్ ఫ్రంట్ గ్రిల్, M పెర్ఫార్మెన్స్ అల్కాంటారా గేర్ సెలెక్టర్ లివర్, ఇతర BMW M పెర్ఫార్మెన్స్ పార్ట్‌లు ఉన్నాయి. కస్టమర్‌లు BMW ఆన్‌లైన్ షాప్‌ని సందర్శించవచ్చు. సురక్షితమైన ఆన్‌లైన్ పేమెంట్ విధానం ద్వారా బుకింగ్ చేయవచ్చు. మొదట వచ్చిన వారికి ప్రాతిపదికన డెలివరీలు జరుగుతాయని BMW ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది.

Read Also : Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఆ 5 రోజులు ఎందుకంటే? అసలు కారణం ఇదే..!