Airtel hikes price of its cheapest plan by 57 per cent, here's how much it costs now
Airtel Plans Price Hike : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) ఇటీవల ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఈశాన్య, కర్ణాటక, యూపీ-వెస్ట్‌లో అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. దీంతో టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న బేస్ ప్లాన్ రేటు ఇప్పుడు 57 శాతం పెరిగింది. ఇకపై ప్రీపెయిడ్ యూజర్లు ఎంట్రీ లెవల్ ప్లాన్ కోసం వినియోగదారులు రూ. 99 బదులుగా రూ. 155 చెల్లించాల్సి ఉంటుంది.
టెల్కో కంపెనీ ఆదాయాన్ని, మార్జిన్లను పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ టారిఫ్‌లను సవరిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిలో ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్‌ను రద్దు చేసింది. హర్యానా, ఒడిశాలో ఈ ప్లాన్ తొలగించింది. ఇప్పుడు, మరిన్ని సర్కిల్‌లలో ఎయిర్‌టెల్ రూ. 99 ప్లాన్ అందుబాటులో లేదు. దీని వలన ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను రూ.155కి పెంచినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లిమిటెడ్ టాక్-టైమ్‌ను అందించింది. అప్‌గ్రేడ్ ద్వారా రూ.155 బేస్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 1GB డేటాను 24 రోజుల పాటు అందిస్తోంది. రూ. 99 సరసమైన ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందించింది. కొత్త బేస్ ప్లాన్ కచ్చితంగా వినియోగదారులకు భారంగా మారనుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌ను సెకండరీ సిమ్‌గా ఉపయోగించే యూజర్లకు కష్టమనే చెప్పాలి. భవిష్యత్తులో మరిన్ని సర్కిల్‌ల నుంచి ఎయిర్‌టెల్ రూ.99ని రద్దు చేస్తుందని భావిస్తున్నారు.
Airtel hikes price of its cheapest plan by 57 per cent
రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వంటి టెలికాం దిగ్గజాలు తమ ప్రస్తుత ప్లాన్‌ల ధరలను 10 శాతం మేర పెంచనున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం ఆపరేటర్లు రాబోయే 3 సంవత్సరాలలో అంటే.. FY23, FY24 & FY25 Q4లో 10 శాతం టారిఫ్‌ల పెంపును ప్రకటించవచ్చు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి నాల్గవ త్రైమాసికంలో మొబైల్ ప్లాన్‌ల ధరలను మరింత పెంచవచ్చు.
కంపెనీల రాబడి, మార్జిన్‌లపై ఒత్తిడి పెరగడం వల్లే టారిఫ్‌ల పెంపుదల జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో త్రైమాసికంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియోలకు టెలికాం కంపెనీ పనితీరు కీలక సూచిక ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) మధ్యస్తంగా పెరిగింది. ఇప్పుడు, ధరల పెంపుతో, ARPU గణనీయమైన పెరుగుదలను చూస్తుంది. ఆదాయం కూడా చందాదారుల బేస్ మీద ఆధారపడి ఉంటుంది. గత కొన్ని నెలల్లో, ఎయిర్‌టెల్, జియో రెండూ తమ సబ్‌స్క్రైబర్ బేస్ గణనీయంగా పెంచాయి.
దీంతో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేందుకు రెండు టెలికాం కంపెనీల మధ్య పోటీ భారీగా పెరిగింది. జియో, ఎయిర్‌టెల్ కూడా ప్రస్తుతం 5G కోసం నెక్-టు-నెక్ పోటీ పడుతున్నాయి. ఎందుకంటే భారత మార్కెట్లో 5G సర్వీసులను అందిస్తున్న రెండు టెల్కోలు మాత్రమే. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (Vi) ఆదాయం, సబ్‌స్క్రైబర్ బేస్‌లో నష్టాన్ని చవిచూస్తోంది. భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా Vodafone-Idea ఆర్థిక సమస్యలతో పోరాడుతోంది. భారత్‌లో 5Gని ప్రారంభించడంలో కూడా వెనుకంజలో ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..