Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. 2.5GB రోజువారీ డేటా లిమిట్.. ఏయే ప్లాన్ల ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 899, రూ. 349 ధరతో కొత్తగా ప్లాన్‌లను తీసుకొచ్చింది.

Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. 2.5GB రోజువారీ డేటా లిమిట్.. ఏయే ప్లాన్ల ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Jio vs Airtel plans offering 2.5 GB daily data Limit

Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 899, రూ. 349 ధరతో కొత్తగా ప్లాన్‌లను తీసుకొచ్చింది. స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, 2.5GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తాయి. అయితే, ఎయిర్‌టెల్ యూజర్లు FOMO చెందాల్సిన అవసరం లేదు. Jio పోటీదారులు కూడా 2.5GB రోజువారీ డేటా లిమిట్, కాలింగ్, అదనపు బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను పొందవచ్చు. Jio, Airtel అందించే 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం.. అందులో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.

జియో 2.5 GB డేటా ప్లాన్స్ :
రూ. 349 ప్లాన్ : కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ 2.5GB రోజువారీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు వెల్‌కమ్ ఆఫర్ పొందాల్సి ఉంటుంది. Jio 5G కవరేజీ ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే Jio 5Gని యాక్సెస్ చేయవచ్చు. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే Jio యాప్‌లలో JioTV, JioCinema, JioSecurity, JioCloud ఫ్రీగా సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ. 899 ప్లాన్ : ఈ ప్లాన్‌తో, Jio అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 2.5GB డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీతో వ్యవధిలో రోజువారీ 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 225GB డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కోసం JioTV, JioCinema, JioSecurity, JioCloud ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ కూడా Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ పొందాల్సి ఉంటుంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?

రూ. 2023 ప్లాన్ : రిలయన్స్ జియో కొత్త ఏడాది ప్రారంభంలో దీర్ఘకాలిక ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో యూజర్లు 2.5GB రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్ లిమిట్‌తో 630GB మొత్తం డేటాతో 252 రోజుల ప్యాక్ వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్యాక్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్ (JioTV, JioCinema, JioSecurity JioCloud) బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

Jio vs Airtel plans offering 2.5 GB daily data Limit

Jio vs Airtel plans offering 2.5 GB daily data Limit

Airtel 2.5 GB డేటా ప్లాన్స్ ఇవే :
రూ. 399 ప్లాన్ : ఎయిర్‌టెల్ అందించే ప్లాన్లలో ఈ ప్లాన్ ఒకటి. 2.5GB రోజువారీ డేటా ప్లాన్లను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 999 ప్లాన్ : 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ యూజర్లు 2.5GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. OTT సబ్‌స్క్రిప్షన్ విషయానికొస్తే.. ఈ ప్లాన్ Airtel యాప్, వెబ్‌లో 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌తో పాటు (Amazon Prime) కోసం 84 రోజుల సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్ 1 ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో సహా మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 SMS పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Big Update : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై హై-క్వాలిటీ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు..!