Airtel Prepaid Plans
Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మిలియన్ల మంది యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాను (Airtel Plans) అందిస్తోంది. గత ప్లాన్ కన్నా కేవలం రూ.1 ఎక్కువ ధరకే ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్ అదనంగా 14GB డేటాను అందిస్తుంది. ఈ కొత్త ప్లాన్ దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలోని యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ సరసమైన కొత్త ప్లాన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ కొత్త రూ.399 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ రూ. 399 తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. సబ్‌స్క్రైబర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ (జమ్మూ, కాశ్మీర్ మినహా) ఆనందిస్తారు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMS కూడా ఉన్నాయి. అదనంగా, కంపెనీ ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ అందిస్తోంది.
రూ. 1కే 14GB అదనపు డేటా :
ఎయిర్‌టెల్ గతంలో రూ.398 రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, భారత్ అంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందించింది. ఆ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందించింది. అదనంగా ఒక రూపాయితో కొత్త రూ.399 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ అదనంగా 512MB డేటాను పొందవచ్చు. ఒక నెల వ్యవధిలో రూ.1 ఖర్చుతో అదనంగా 14GB డేటా పొందవచ్చు.
ట్రాయ్ డేటా ప్రకారం.. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది. లక్షలాది మంది కొత్త యూజర్లు చేరారు. కంపెనీ యూజర్ల సంఖ్య ఇప్పుడు 360 మిలియన్లను దాటింది. జియో కూడా భారీ సంఖ్యలో యూజర్లు చేరారు.
వోడాఫోన్ ఐడియా (Vi), బీఎస్ఎన్ఎల్ కలిసి 2లక్షల కన్నా ఎక్కువ మంది కస్టమర్లను కోల్పోయాయని నివేదిక సూచిస్తుంది. గత మేలో రెండు టెలికం కంపెనీలు సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గాయి, బీఎస్ఎన్ఎల్ మాత్రం 1,35,000 కన్నా ఎక్కువ మంది యూజర్లను కోల్పోయింది. వోడాఫోన్ ఐడియా 2,74,000 కన్నా ఎక్కువ మంది యూజర్లను కోల్పోయింది.