Vivo T4R 5G : వివో లవర్స్ డోంట్ మిస్.. ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4R 5G ఫోన్ ఆగయా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Vivo T4R 5G : వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. అత్యంత సరసమైన ధరకే వివో T4R 5G మోడల్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంతంటే?

Vivo T4R 5G
Vivo T4R 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. దేశంలో కంపెనీ T సిరీస్‌లో కొత్తగా వివో T4R 5G సిరీస్ (Vivo T4R 5G) లాంచ్ చేసింది. ఇందులో వివో T4 లైట్, వివో T4 అల్ట్రా, వివో T4x, వివో T4 కూడా ఉన్నాయి.
ఈ కొత్త వివో ఫోన్ మిడ్-బడ్జెట్ కేటగిరీలో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 + IP69 రేటింగ్ కూడా కలిగి ఉంది. 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5700mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
వివో T4R 5G భారత్ ధర ఎంతంటే? :
వివో T4R ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో (Vivo T4R 5G) లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499కు లభిస్తుంది. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499కు లభిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499కు కొనుగోలు చేయొచ్చు.
Read Also : OnePlus 13R : వారెవ్వా.. ఆఫర్ కేక.. వన్‌ప్లస్ 13R ఫోన్ అతి తక్కువ ధరకే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
ఆగస్టు 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, Axis బ్యాంక్ కార్డులతో రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా వివో T4R స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
వివో T4R 5G స్పెసిఫికేషన్లు :
వివో T4R ఫోన్ 6.77-అంగుళాల (Vivo T4R 5G) అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరా, 2MP బోకె సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ 5,700mAh బ్యాటరీ కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ నానో సిమ్ స్లాట్లు, బ్లూటూత్ 5.4, వైఫై 6 వంటి మరిన్ని ఆప్షన్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 183.5 గ్రాములు ఉంటుంది.