Airtel New OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం 5 కొత్త ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీగా OTT సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel New OTT Plans : ఎయిర్‌టెల్ (Airtel) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్లపై ఉచితంగా 5G డేటాతో పాటు OTT యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

Airtel New OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్లకు 5G సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు.. ఎంచుకున్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. టెలికాం మార్కెట్లో 5G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న (Airtel) సబ్‌స్క్రైబర్‌లకు బ్రౌజింగ్, స్ట్రీమింగ్ కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు అన్ కంట్రోల్డ్ యాక్సస్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ అందించే నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లపై (Amazon Prime), డిస్నీ ప్లస్ (Disney+) హాట్‌స్టార్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ యూజర్లు తమకు ఇష్టమైన OTT కంటెంట్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వీక్షించవచ్చు. మీరు ఎయిర్‌టెల్ 5G యూజర్ అయితే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ పొందాలనుకుంటే.. (Amazon Prime) లేదా (Disney+ Hotstar)కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5G ప్లాన్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన ఎయిర్‌టెల్ ప్లాన్ ఎంచుకోండి.

రూ. 499 ప్లాన్ :
ఈ లేటెస్ట్ ప్లాన్ కింద 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMSలతో అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. అదనంగా, ఎయిర్‌టెల్ (Xtream) యాప్ బెనిఫిట్స్ పొందవచ్చు. వింక్ (Wink) సబ్‌స్క్రిప్షన్ వంటి మరిన్ని బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Disney+ Hotstar మొబైల్‌కు 3-నెలల సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. ఇంకా 5G సర్వీసులు అందుకోని యూజర్ల కోసంఈ ప్లాన్ రోజువారీ 3GB క్యాప్‌తో అన్‌లిమిటెడ్ 4G డేటాను అందిస్తుంది.

రూ. 839 ప్లాన్ :
ఎయిర్‌టెల్ 84-రోజుల ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. సబ్‌స్క్రయిబర్‌లు Xstream యాప్, RewardsMini సబ్‌స్క్రిప్షన్, Wynk సబ్‌స్క్రిప్షన్ వంటి మరిన్ని ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Disney+ Hotstar మొబైల్‌కి 3 నెలల సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. మీ ప్రాంతంలో 5G సర్వీసులు అందుబాటులో లేకుంటే.. ఈ ప్లాన్ రోజువారీ 2GB లిమిట్‌తో అన్‌లిమిటెడ్ 4G డేటాను అందిస్తుంది.

Read Also : Airtel 5G Plus Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ ప్లాన్లతో ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్.. ఈ ఆఫర్ పొందాలంటే?

రూ. 3359 ప్లాన్
ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో (Disney+ Hotstar Mobile), Apollo 24|7 బెనిఫిట్స్, Wynk సబ్‌స్క్రిప్షన్, మరిన్నింటికి 1-ఏడాది సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తుంది. ఇంకా 5G కవరేజ్ ఏరియాలో లేని వారికి ఈ ప్లాన్ రోజువారీ లిమిట్ 2.5GBతో అన్‌లిమిటెడ్ 4G డేటాను అందిస్తుంది.

Airtel New OTT Plans : Airtel introduces new plans with unlimited 5G data

రూ. 699 ప్లాన్ :
ఎయిర్‌టెల్ 56 రోజుల ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు 56 రోజుల (Amazon Prime) మెంబర్‌షిప్‌తో పాటు (Xstream) యాప్ బెనిఫిట్స్, Wynk సబ్‌స్క్రిప్షన్‌లు వంటి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. 5G సర్వీసులకు యాక్సెస్ లేని వారికి.. ఈ ప్లాన్ రోజువారీ 3GB క్యాప్‌తో అన్‌లిమిటెడ్ 4G డేటాను అందిస్తుంది.

రూ. 999 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు Xtream యాప్ బెనిఫిట్స్, వింక్ సబ్‌స్క్రిప్షన్, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్ వంటి మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్‌ను 84 రోజుల పాటు పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5G సర్వీసులను పొందలేని యూజర్లు ఈ ప్లాన్ కింద రోజువారీ 2.5GB క్యాప్‌తో అన్‌లిమిటెడ్ 4G డేటాను అందిస్తుంది.

Read Also : Best Airtel Plans : రూ. 500లోపు బెస్ట్ ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో బెనిఫిట్స్

ట్రెండింగ్ వార్తలు