Airtel 5G Plus Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ ప్లాన్లతో ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్.. ఈ ఆఫర్ పొందాలంటే?

Airtel 5G Plus Plans : Airtel 5G ప్లస్ నెట్‌వర్క్ కవరేజ్ ఏరియాలోని (Airtel) యూజర్లందరూ 5Gని ఉచితంగా ఉపయోగించవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తప్పక కలిగి ఉండాలి.

Airtel 5G Plus Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ ప్లాన్లతో ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్.. ఈ ఆఫర్ పొందాలంటే?

Airtel is offering free unlimited 5G data benefits with some recharge plans List of plans, how to claim the offer

Airtel 5G Plus Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) యూజర్లకు ఎలాంటి డేటా క్యాప్ లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇటీవలి ప్రకటనలో Airtel 5G ప్లస్ కవరేజ్ ప్రాంతంలో నివసిస్తున్న Airtel యూజర్లు తమ 5G రెడీ ఫోన్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చని వెల్లడించింది.

5G ఇంటర్నెట్ డేటా యూజర్లకు ఉచితంగా లభిస్తుంది. మరో టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో (Reliance Jio Plans) రోజువారీ డేటాకు ఎలాంటి లిమిట్ లేకుండా అన్‌లిమిటెడ్ 5Gని అందించింది. ఈసారి ఎయిర్‌టెల్ జియో కన్నా ఒక అడుగు ముందుకేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా తన 5G అభివృద్ధిని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో 5G స్పీడ్‌ను ఉచితంగా అందిస్తోంది.

అన్‌లిమిటెడ్ Airtel 5Gని ఎలా పొందాలంటే? :
Airtel 5G ప్లస్ నెట్‌వర్క్ కవరేజ్ ఏరియాలోని (Airtel) యూజర్లందరూ 5Gని ఉచితంగా ఉపయోగించవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తప్పక కలిగి ఉండాలి. తమ స్మార్ట్‌ఫోన్‌లో Airtel 5Gని ఎనేబుల్ చేయాలి. అన్‌లిమిటెడ్ 5G డేటాను Airtel థాంక్స్ యాప్‌ని విజిట్ చేయండి. అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను పొందండి. Airtel 5Gకి కనెక్ట్ చేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌లో Settings> Networks And Data వెళ్లండి> (Airtel SIM)పై Tap చేయండి> 5G Networkను ప్రారంభించండి.

Read Also : Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5G అన్‌లిమిటెడ్ డేటాను ఎవరైనా వాడుకోవచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?

మీ నగరంలో 5G అందుబాటులో ఉన్నప్పటికీ.. మీరు నెట్‌వర్క్‌ని పొందలేకపోతే.. మీ ప్రాంతంలో ఎప్పుడు లైవ్‌లోకి వస్తుందో చెక్ చేయడానికి (Airtel Thanks) యాప్‌కి వెళ్లండి. Airtel 5G ప్లస్ ప్రస్తుతం 270 కన్నా ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. Airtel 5G ఇప్పుడు 265 నగరాల్లో అందుబాటులో ఉంది. అందులో నగరాల పూర్తి జాబితాతో పాటు ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Airtel is offering free unlimited 5G data benefits with some recharge plans List of plans, how to claim the offer

Airtel is offering free unlimited 5G data benefits with some recharge plans

అన్‌లిమిటెడ్ 5G డేటాతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ. 239, అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. వినియోగదారులు ఈ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్యాక్‌లలో ఒకదానిని కలిగి ఉంటే రోజువారీ డేటా అయినా ఆందోళనక్కర్లేదు. అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.రూ. 239, రూ. 265, రూ. 296, రూ. 299, రూ. 319, రూ. 359, రూ. 399, రూ. 455, రూ. 479, రూ.489, రూ.499, రూ.509, రూ.519, రూ.549, రూ.666, రూ.699, రూ.719, రూ.779, రూ.839, రూ.999, రూ.1799, రూ. 2999, రూ. 3359 వరుసగా ఉన్నాయి.

ఈ ప్లాన్‌లలో కొన్ని అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. వినియోగదారులు 5G ఇంటర్నెట్ స్పీడ్‌తో OTT బెనిఫిట్స్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్ స్పీడ్ ప్రస్తుత 4G నెట్‌వర్క్ కన్నా 20 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

అన్‌లిమిటెడ్ 5G డేటాతో Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లివే :
Airtel అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఉచితంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ. 399, రూ. 499, రూ. 599, రూ. 999, రూ. 1199, రూ. 1499 ధరలలో అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్లాన్‌లలో అన్‌‌లిమిటెడ్కాలింగ్, SMS బెనిఫిట్స్ అందిస్తున్నాయి. రూ. 499, రూ. 1499 మధ్య ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు ఉచితంగా సభ్యత్వాలను పొందవచ్చు.

Read Also : Honda Shine Hero Deluxe : హోండా షైన్ 100 vs హీరో HF డీలక్స్ vs హీరో స్ప్లెండర్+ vs బజాజ్ ప్లాటినా 100.. ఏది తక్కువ ధరంటే? పూర్తి వివరాలివే..!