Amazon Diwali Sale End Today : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఇదే సరైన సమయం.. అమెజాన్ దీపావళి సేల్ ఈరోజు (డిసెంబర్ 10)తోనే ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ 13 హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతోంది. పూర్తిగా తగ్గింపు ధరతో గత ఏడాదిలో ఐఫోన్ 14 మాదిరిగానే ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తి గల వినియోగదారులు ఐఫోన్ 13ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఏడాదిలో అమెజాన్ యొక్క దీపావళి సేల్ ఈవెంట్‌లో ఈ ఐఫోన్ భారీ తగ్గింపుతో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ సేల్ ముగియడానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఐఫోన్ 13 కొనలేనివారంతా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ, ఐఫోన్ 13 కొనుగోలు చేయాలా వద్దా అనే పూర్తివివరాలను తెలుసుకుందాం.
అమెజాన్‌లో ఐఫోన్ 13 ధర కనిష్ట స్థాయికి.. :
ప్రస్తుతం ఐఫోన్ 13 భారీ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ డివైజ్ రూ. 50,498 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఆపిల్ స్టోర్‌లలో ఐఫోన్ 13 ధర రూ.59,900కి పడిపోయింది. అమెజాన్‌లో యూజర్లు రూ. 9,402 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేల వరకు తగ్గింపు ఆఫర్ కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌లను కూడా ఎంచుకోవచ్చు.
ఐఫోన్ 13కి భారీ తగ్గింపు.. కొనుగోలు చేయాలా? వద్దా? :
ఐఫోన్ 13, ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌తో సమానంగా ఉంటుంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 57,999కి అమ్ముడవుతోంది. మీరు హుడ్ కింద ఎక్కువ లేదా తక్కువ అదే కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్‌ను పొందవచ్చు. డివైజ్ పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా తేడా లేదు. డిజైన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే.. ఆపిల్ ఐఫోన్ 11 లాంచ్ అయినప్పటి నుంచి అదే డిజైన్‌ను అందిస్తోంది. ఆపిల్ 5 ఏళ్ల పాత ఐఫోన్‌లకు కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తోంది. ఐఫోన్ 13 ఇప్పటికీ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది.
Amazon Diwali Sale iPhone 13 Offer
యూజర్లకు ఐఫోన్ 13 సున్నితమైన పర్ఫార్మెన్స్ అందించగలదు. సగటు వినియోగంతో ఒక రోజు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అయితే, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ లేదని గమనించాలి. మీరు బాక్స్‌లో ఛార్జర్‌ని పొందలేరు. స్క్రీన్ పవర్‌ఫుల్ కంటెంట్ వినియోగానికి తగినంత పెద్దదిగా ఉంటుంది. మీరు ఐఫోన్ అభిమాని అయితే.. విక్రయించే ధరకు విలువైనది.
దాదాపు రూ. 80వేల ఖర్చు చేయగల యూజర్లు ఐఫోన్ 15 కొనుగోలు చేయొచ్చు. లేదంటే.. మరో 3 నెలల నుంచి 5 నెలల వరకు వేచి ఉండవచ్చు. కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఇతర ప్రాంతాల పరంగా ఐఫోన్ 14, ఐఫోన్ 13 రెండింటి కన్నా మెరుగైన ఐఫోన్. మీ బడ్జెట్ దాదాపు రూ. 50వేలు అయితే, ప్రస్తుతం మీకు ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.