Telugu » Technology » Amazon Great Indian Festival Sale 2025 Last Chance To Grab Iphone 16 And Iphone 15 At Lowest Price Sh
Amazon Great Indian Festival Sale : అమెజాన్ సేల్ ముగుస్తోంది.. లాస్ట్ ఛాన్స్ భయ్యా.. ఐఫోన్ 15, ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Great Indian Festival Sale 2025 : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ 15, ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ పొందాలంటే?
Amazon Great Indian Festival Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 త్వరలో ముగియనుంది. దసరా, దీపావళికి ముందు చివరి నిమిషంలో పండుగ షాపింగ్ చేసేందుకు ఇదే సరైన సమయం. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 15తో సహా పాపులర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
2/6
ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు, అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డీల్స్, అమెజాన్ పే రివార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనపు సేవింగ్స్ కూడా అందిస్తోంది. మీరు ఐఫోన్ కోసం చూస్తుంటే లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 16 రూ. 12,900 కన్నా భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే, ఐఫోన్ 15 రూ. 48వేల లోపు లభిస్తుంది. మీకు ఇష్టమైన ఐఫోన్‌ను తగ్గింపు ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
3/6
అమెజాన్‌లో ఐఫోన్ 16 డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16 ధర రూ. 79,900కు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం అమెజాన్ రూ. 66,990కు విక్రయిస్తోంది. అంటే.. ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 12,910కు అందిస్తోంది. మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అయితే ఈఎంఐ కాకుండా డైరెక్ట్ పేమెంటుపై రూ. 3వేలు సేవ్ చేయవచ్చు. మీ పాత ఫోన్‌లో ట్రేడ్ చేస్తే ధర రూ. 52,600 వరకు తగ్గుతుంది. ఐఫోన్ 16 అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
4/6
అమెజాన్‌లో ఐఫోన్ 15 డీల్ : తక్కువ ధరలో కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే.. 2024లో లాంచ్ అయిన ఐఫోన్ 15 భారీగా తగ్గింపుతో లభిస్తోంది. ఐఫోన్ 15 లాంచ్ ధర రూ.69,900 నుంచి అమెజాన్‌లో రూ.47,999కి అందుబాటులో ఉంది.
5/6
అంతేకాదు.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,439 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
6/6
ఈజీ ఈఎంఐలను ఇష్టపడే వారికి అమెజాన్ నెలకు రూ.2,327 నుంచి ఈఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ రూ.43,850 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో మరింత సేవింగ్ చేసుకోవచ్చు.