Motorola Razr 60 Ultra (Image Credit To Original Source)
Motorola Razr 60 Ultra : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ అదిరిపోయే డీల్స్ మీకోసమే..
ప్రత్యేకించి మోటోరోలా అభిమానుల కోసం మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ. 99,999కి లాంచ్ కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 20వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
అంతేకాదు.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCతో భారీ డిస్‌ప్లేను అందిస్తుంది. 16GB ర్యామ్ 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా 50MP ప్రైమరీ అల్ట్రావైడ్ సెన్సార్‌లు ఉన్నాయి. అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5జీ డీల్ :
ప్రస్తుతం మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5జీ ఫోన్ రూ.79,998 ధరకు లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర రూ.99,999 నుంచి ఏకంగా రూ.20,001 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.7,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.72,748కి తగ్గుతుంది.
ఈ-కామర్స్ బ్రాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి కొనుగోలుదారులు రూ. 42వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అమెజాన్ నెలకు రూ. 2,812 నుంచి నెలవారీ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
Motorola Razr 60 Ultra (Image Credit To Original Source)
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.96-అంగుళాల ఎల్టీపీఓ pOLED ప్యానెల్ అందిస్తుంది. 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. గొరిల్లా గ్లాస్ సిరామిక్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. బయట వైపు డివైజ్ కూడా అదే 165Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్ ప్రకాశంతో 4-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ కవర్ స్క్రీన్‌తో వస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC కూడా ఉంది. 16GB LPDDR5X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. పవర్ పరంగా, ఈ ఫోన్ 4,700mAh బ్యాటరీతో 68W వైర్డు, 30W వైర్‌లెస్ 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ప్రైమరీ, అల్ట్రావైడ్ లెన్స్‌లతో సహా డ్యూయల్ 50MP సెన్సార్‌లు, OISతో 50MP ఫ్రంట్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, 30x ఏఐ సూపర్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.