Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, టీవీ, కెమెరా లేదా వైర్‌లెస్ స్పీకర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 అతి త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సేల్ సమయంలో అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై బంపర్ డిస్కౌంట్లతో లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ హోం అప్లియన్సెస్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మొత్తంమీద, సగం కన్నా తక్కువ ధరకు షాపింగ్ చేయవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై కిర్రాక్ డీల్స్ :
వన్‌ప్లస్ 15R మోడల్ ధర రూ. 54,999 నుంచి రూ. 44,999కు తగ్గుతుంది. ఐక్యూ నియో 10 5జీ (8GB+256GB)ధర రూ. 38,999 నుంచి రూ.33,999కు తగ్గుతుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ రూ.34,999 నుంచి రూ. 30,999కు పొందవచ్చు.
మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డీల్స్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ5 స్మార్ట్‌ఫోన్ రూ. 28,999 నుంచి రూ. 22,999కు తగ్గుతుంది. రెడ్‌మి నోట్ 15 5జీ ధర రూ. 26,999 నుంచి రూ.20,999కు తగ్గుతుంది. ఒప్పో F31 5జీ ఫోన్ రూ. ధర రూ. 27,999 నుంచి రూ. 25,499కు తగ్గింపు పొందనుంది.
వనప్లస్ 15ఆర్ :
అమెజాన్ సేల్ సమయంలో వనప్లస్ 15ఆర్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందు 12GB, 256GB వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 47,998గా ఉంది. అమెజాన్ సేల్ సమయంలో క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్‌తో రూ.44,999కి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై భారీ తగ్గింపు :
ఈ శాంసంగ్ ఫోన్ 8GB,128GB వేరియంట్ ప్రస్తుతం రూ. 24,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ రూ. 23,999కి అందుబాటులో ఉంటుంది. తద్వారా రూ. 1,000 సేవ్ చేసుకోవచ్చు.