Samsung Galaxy S25 5G : వారెవ్వా.. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 22వేలు డిస్కౌంట్.. ఇలా కొంటే ఇంకా తక్కువకే..!

Samsung Galaxy S25 5G : మీరు రూ. 60 వేల బడ్జెట్‌లో కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ అద్భుతమైన ఆప్షన్.. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

  • Published on- September 11, 2026 / 08:11 PM IST

Samsung Galaxy S25 5G

  • శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 50MP మెయిన్ కెమెరా
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ ఉంది
  • 4,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్

Samsung Galaxy S25 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ తక్కువ ధరలో కొనేసుకోవచ్చు.. మీరు శాంసంగ్ అభిమాని అయితే బెస్ట్ టైమ్.. రూ. 60 వేల బడ్జెట్‌లో కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఇంతకన్నా ఆఫర్ మళ్లీ ఉండదు. శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ శాంసంగ్ ఫోన్‌పై చౌకైన ధరకే ఆఫర్ అందిస్తోంది.

ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లతో ఇంకా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే మరి మంచిది.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా (Samsung Galaxy S25 5G) అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 4,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ధర, ఆఫర్లు :

శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,328 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో PNB లక్సురా క్రెడిట్ కార్డుపై ఫ్లాట్ రూ. 2,500 డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర రూ. 58,828 అవుతుంది. ఈ ఫోన్ గత ఏడాది జనవరిలో రూ. 80,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు సుమారు రూ. 22వేలు చౌకగా లభిస్తుంది. అయితే, పాత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : Lava Bold N4 Pro 5G : ఇది కదా ఫోన్.. కొత్త లావా బోల్డ్ N4 ప్రో 5G వస్తోంది.. లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ అందిస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 146.9mm పొడవు, 70.5mm వెడల్పు, 7.2mm మందం, బరువు 162 గ్రాములు ఉంటుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 10MP అల్ట్రావైడ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.2 USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.