Amazon Prime Day Sale
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది.. జూలై 12 నుంచి జూలై 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు, ఎయిర్ కండిషనర్లు, (Amazon Prime Day Sale) రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్ సందర్భంగా అమెజాన్ వివిధ రకాల గాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. మీరు OnePlus, Samsung, iQOO, Apple వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్స్ ఓసారి లుక్కేయండి.
స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే :
అమెజాన్ సేల్ ప్రారంభమైంది. ఈరోజు (జూలై 12) నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది. అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్ల కొనుగోలుపై వేలల్లో ఆదా చేసుకోవచ్చు. ఇందులో వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ 5 CE, శాంసంగ్ గెలాక్సీ M36, గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 అల్ట్రా, ఐక్యూ 13, ఐక్యూ Z10, ఐక్యూ Z10 లైట్, రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, Lenovo, Dell, HP, Acer వంటి బ్రాండ్‌ల టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
AC, రిఫ్రిజిరేటర్లపై అద్భుతమైన డిస్కౌంట్లు :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు Samsung, LG, Daikin, Voltas, Bluestar వంటి బ్రాండ్ల నుంచి విండో, స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. మీరు 1-టన్, 1.5-టన్, 2-టన్ యూనిట్లపై ఒరిజినల్ రిటైల్ ధరలలో సగం ధరకే పొందవచ్చు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరిన్నింటిపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు. ఫ్రిజ్ కొనుగోలుపై 70 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్ ఆఫర్లు కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే. అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ రూ. 399 నుంచి ప్రారంభమవుతుంది. ఏడాది వరకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ ఏడాదికి రూ. 799కు అందుబాటులో ఉంది. మీరు స్టాండర్డ్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటే వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ. 1,499, నెలవారీ ప్లాన్ రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది.