Amazon Republic Day Sale : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. టాప్ 5 బెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డీల్స్.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Amazon Republic Day Sale : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందించే ఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.

Amazon Republic Day Sale _ Get the best of Android with deals on OnePlus phones

Amazon Republic Day Sale : భారత మార్కెట్లో వన్‌ప్లస్ అత్యంత పాపులర్ బ్రాండ్‌లలో ఒకటి. వివిధ బడ్జెట్ ఫోన్లలో పెర్ఫామెన్స్ పవర్‌హౌస్, ఆకట్టుకునే కెమెరాలు లేదా రోజంతా బ్యాటరీ లైఫ్ అందించే ఫీచర్లు మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా అమెజాన్‌లో అద్భుతమైన డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్ కొనుగోలు నుంచి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. వన్‌ప్లస్ డివైజ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని ఫోన్లలో టాప్ 5 వన్‌ప్లస్ డివైజ్‌లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

Read Also : OnePlus 12R Launch : ఈ నెల 23న వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందుగానే కలర్ ఆప్షన్లు లీక్..!

1. వన్‌ప్లస్ 11 5జీ (టైటాన్ బ్లాక్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) :
అద్భుతమైన టైటాన్ బ్లాక్ వేరియంట్‌లో వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. టాప్-ఆఫ్-లైన్ ఫీచర్లతో వన్‌ప్లస్ 11 5జీ అనేది అద్భుతమైన డివైజ్. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో మల్టీ టాస్కింగ్‌ పూర్తి చేయొచ్చు. అది గేమ్‌లు లేదా హై క్వాలిటీ ఫొటోలు కావచ్చు. కొనుగోలుదారులు వేగవంతమైన 5జీ కనెక్టివిటీని పొందవచ్చు. కర్వడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. వన్‌ప్లస్ 11 5జీ ఫోన్.. ప్రస్తుత అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

OnePlus 11 5G

వన్‌ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్‌లు :
కలర్ : టైటాన్ బ్లాక్
ర్యామ్ : 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
నెట్‌వర్క్ : 5జీ
డిస్‌ప్లే : 6.7 అంగుళాలు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 120హెచ్‌జెడ్ అమోల్డ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్
కెమెరా : 50ఎంపీ ప్రధాన కెమెరా, 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపీ టెలిఫోటో లెన్స్
బ్యాటరీ : 100డబ్ల్యూ సూపర్ వూక్‌తో 5000ఎంఎహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్

2. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (సోనిక్ బ్లాక్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) :
వన్‌ప్లస్ 11 5జీ డివైజ్.. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అమర్చిన వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్లిమ్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆకర్షించడానికి పవర్‌ఫుల్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మల్టీఫేస్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అంతేకాదు.. ఈ 5జీ ఫోన్ అనేది ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ డివైజ్ తక్కువ ధరతో అందుబాటులో ఉంది.

OnePlus 11R 5G

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
కలర్ : సోనిక్ బ్లాక్
ర్యామ్ : 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
నెట్‌వర్క్ : 5జీ
డిస్‌ప్లే : 6.7 అంగుళాలు; 120హెచ్‌జెడ్ సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్
50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా

3. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (అక్వా సర్జ్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ అనేది తక్కువ బడ్జెట్‌ ఫోన్ అయినప్పటికీ.. ఇప్పటికీ వన్‌ప్లస్ ఫోన్లలో బెస్ట్ డివైజ్. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. అన్ని డాక్యుమెంట్‌లకు మొత్తం మీడియా లైబ్రరీని వేగంగా యాక్సస్ చేయొచ్చు. 5జీ కనెక్టివిటీతో మల్టీ టాస్కింగ్‌ కోసం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా సులభంగా కనెక్ట్ కావచ్చు. ఆక్వా సర్జ్ వేరియంట్ ఫ్యాషన్ డివైజ్కోరుకునే యూజర్లకు ఇది స్టైలిష్ ఆప్షన్. సోషల్ మీడియాను ఉపయోగించే వారికి తేలికపాటి గేమ్‌లను ఆడే రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది. మీరు గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఫోన్‌ చూస్తుంటే.. ఇది సరైన ఆప్షన్ కాకపోవచ్చు.

OnePlus Nord CE 3 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్పెసిఫికేషన్‌లు :
కలర్ : ఆక్వా సర్జ్
ప్రదర్శన: 6.7 అంగుళాలు; 120హెచ్‌జెడ్ అమోల్డ్ ఎఫ్‌హెచ్‌డీ+
టైప్ : ఫ్లూయిడ్ అమోల్డ్ 90హెచ్‌జెడ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 13
ర్యామ్ : 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
కెమెరా : 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా

4. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (పాస్టెల్ లైమ్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) :
ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ప్రత్యేకమైన పాస్టెల్ లైమ్ కలర్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న ఫోన్లలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఆకర్షణీయమైనడిజైన్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటెన్సివ్ గేమ్‌ల వంటి హై-పర్ఫార్మెన్స్ అందించలేకపోవచ్చు. చాలా యాప్‌లు ఓపెన్ చేసినప్పుడు ఈ సమస్య ఎదురుకావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రోజువారీ పనులను సులభంగా పూర్తి చేయగలదు. ఆక్సిజన్ఓఎస్ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో బెస్ట్ కెమెరా సెటప్ కూడా ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
కలర్ : పాస్టెల్ లైమ్
ర్యామ్ : 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
హై-స్పీడ్ డేటా 5జీ కనెక్టివిటీ
డిస్‌ప్లే : 6.72 అంగుళాలు, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
108 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్-అసిస్ట్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్; ఫ్రంట్ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ
బ్యాటరీ అండ్ ఛార్జింగ్ : 67డబ్ల్యూ సూపర్‌వూక్‌తో 5000ఎంఎహెచ్

5. వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ (టెంపెస్ట్ గ్రే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ)
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీతో ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం రోజువారీ అవసరాలకు సపోర్టుగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. మల్టీ టాస్కింగ్‌ని నిర్వహించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీకు ఇష్టమైన యాప్‌లు, మీడియాకు లోకల్ యాక్సెస్‌ని పొందవచ్చు. టెంపెస్ట్ గ్రే ఎండ్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ 5జీకి సపోర్టుతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుంది. ఆండ్రాయిడ్ 13.1 పైన వన్‌ప్లస్ ఆక్సిజన్ఓఎస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో, మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచుకోవచ్చు. తద్వారా డిజిటల్ ప్రపంచంతో కనెక్ట్ కావచ్చు.

OnePlus Nord 3 5G

వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ స్పెసిఫికేషన్‌లు :
కలర్ : టెంపెస్ట్ గ్రే
ర్యామ్: 8జీబీ
స్టోరేజీ : 128జీబీ
కనెక్టివిటీ : 5జీ
ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్ (4ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్)
బ్యాటరీ & ఛార్జింగ్ : 80డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఎహెచ్
కెమెరా: 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో

Read Also : WhatsApp New Updates : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఛానెల్స్, వాయిస్ నోట్స్, పోల్స్ కోసం సరికొత్త ఫీచర్లు..!