OnePlus 12R Launch : ఈ నెల 23న వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందుగానే కలర్ ఆప్షన్లు లీక్..!

OnePlus 12R Launch : వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ అతి త్వరలో అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లో ఈ నెల 23న లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 12R Launch : ఈ నెల 23న వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందుగానే కలర్ ఆప్షన్లు లీక్..!

OnePlus 12R to Be Available for Purchase via Amazon

Updated On : January 6, 2024 / 9:15 PM IST

OnePlus 12R Launch : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12ఆర్ జనవరి 23న లాంచ్ కానుంది. రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో ప్రత్యక్షమైంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులోకి రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ సూపర్ వూక్ సపోర్టుతో 5,500ఎంఎహెచ్ బ్యాటరీతో చైనాకు వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 3 రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుంది.

Read Also : Best phones in India 2024 : ఈ జనవరిలో రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఈ హ్యాండ్‌సెట్ భారత్, ప్రపంచ మార్కెట్లలో లాంచ్ కానుంది. 27 నిమిషాల్లో ఫోన్ 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ 12ఆర్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ల్యాండింగ్ పేజీ అమెజాన్‌లో లైవ్‌లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ జనవరి 23 ప్రారంభ తేదీని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌ను బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ల్యాండింగ్ పేజీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
ఇప్పుడు వన్‌ప్లస్ ఏస్ 3 చైనాలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 12ఆర్ చైనీస్ ఫోన్ల మాదిరిగానే అదే స్పెసిఫికేషన్‌లతో వస్తుందని భావించవచ్చు. వన్‌ప్లస్ 12ఆర్ స్పాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తుందని అంచనా. గరిష్టంగా 16జీబీ వరకు ఎల్‌పీ‌డీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో రానుంది.

ఈ హ్యాండ్‌సెట్ 120హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. గరిష్ట ప్రకాశాన్ని 4,500 నిట్‌ల వరకు కలిగి ఉంటుంది. వన్ ప్లస్ 12ఆర్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను ఎఫ్/1.8 ఎపర్చరు, ఓఐఎస్, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ మాక్రో కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

OnePlus 12R to Be Available for Purchase via Amazon

OnePlus 12R Amazon

ముందు భాగంలో, సెల్ఫీలు క్లిక్ చేసేందుకు వీడియో కాల్స్ చేయడానికి ఎఫ్/2.4 లెన్స్‌తో 16ఎంపీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో, వన్‌ప్లస్ ఏస్ 3 మోడల్ 1టీబీ వరకు యూఎఫ్ఎఫ్ఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఇతర కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది.

వన్‌ప్లస్ 12ఆర్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 100డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. జనవరి 23న జరగబోయే ‘స్మూత్ బియాండ్ బిలీఫ్’ లాంచ్ ఈవెంట్‌కు ముందు రోజుల్లో వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్‌ల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.

Read Also : iQOO Neo 7 Price Cut : ఐక్యూ నియో 7 సిరీస్ ఫోన్ ధర తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతంటే?