Amazon reveals Diwali sale offers
Amazon Diwali Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల (సెప్టెంబర్) 27న ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులు ఒక రోజు ముందుగానే సేల్ ఆఫర్లను యాక్సెస్ చేయొచ్చు. సేల్‌కు కొద్ది రోజుల ముందు, అమెజాన్ ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై దీపావళి సేల్ ఆఫర్‌లను వెల్లడించింది. ఈ 2024 ఏడాదిలో ఐక్యూ ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందించనున్నట్టు ఇప్పటికే కంపెనీ వాగ్దానం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 52,999కి విక్రయించే ఐక్యూ 12 ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉండనుంది. అమెజాన్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ధరను రూ. 47,999కు పొందవచ్చు. ఈ ఆఫర్ బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుంది. రాబోయే అమెజాన్ దీపావళి సేల్ సమయంలో ఐక్యూ 12 రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ అందించే భారతీయ మార్కెట్లో అత్యంత చౌకైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పవచ్చు.
అదేవిధంగా, ఐక్యూ నియో 9 ప్రో ధర రూ. 31,999కు పొందవచ్చు. వాస్తవానికి, భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 35,999తో లాంచ్ అయింది. ఐక్యూ నియో 9 ప్రోకి రూ. 4వేలకు పొందవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఐక్యూ Z9s, ఐక్యూ Z9s ప్రో వరుసగా రూ. 17,499, 21,999 వద్ద అమ్మకానికి వస్తాయి. ఐక్యూ Z9s రూ. 19,999 వద్ద లాంచ్ కాగా ఐక్యూ ప్రో వెర్షన్ రూ. 24,999 వద్ద విక్రయానికి రెడీగా ఉంది. ఐక్యూ Z సిరీస్ ఫోన్‌లు రెండూ ఇటీవల భారత మార్కెట్లో రిలీజ్ కాగా, డిస్కౌంట్ రేట్లలో కొద్దిగా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
అన్ని డీల్స్ ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా ఆఫర్లను పొందవచ్చు. ఇతర బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయో లేదో ప్రస్తుతానికి తెలియదు. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గురించి కచ్చితమైన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ ఐక్యూ ఫోన్ డీల్‌లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా భారీ తగ్గింపును పొందుతాయి.