Android 12 (go Edition) Set To Launch In 2022, Brings Improved Privacy Controls And Battery Life, New Features
Android 12 Go Edition : వరల్డ్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వచ్చే ఏడాది 2022లో కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ లాంచ్ చేయనుంది. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కొత్త ఓఎస్ సాఫ్ట్ వేర్ అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. సరిగ్గా రెండు నెలల తర్వాత గూగుల్ మరో 12GO వెర్షన్ లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. 4 ఏళ్ల నుంచి 200 మిలియన్లకు పైగా యూజర్లు తమ ఫోన్‌లలో లైట్ వెయిట్ ఆండ్రాయిడ్ (GO Edition) OSని వినియోగిస్తున్నారని తెలిపింది. ఆండ్రాయిడ్ గో (Android 12 Go) నెక్స్ట్ వెర్షన్‌లో భాగంగా వచ్చే ఏడాది ఈ కొత్త ఓఎస్ అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సహా కొత్త యాప్ లాంచ్‌లు, ప్రైవసీ కంట్రోల్, లైఫ్ టైమ్ బ్యాటరీతో పాటు న్యూ ట్రాన్సలేషన్ ఫీచర్లు, యాప్ డివైజ్ షేరింగ్ వంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్లను లాంచ్ చేయనున్నట్టు గూగుల్ వెల్లడించింది.
ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం.. స్పెషల్ OS వెర్షన్ :
Android 12GO వెర్షన్ అనేది.. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలోని యాప్స్ వేగవంతంగా ఓపెన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని తెలిపింది. 30 శాతం వరకు మెరుగైన వేగంతో పనిచేస్తాయని పేర్కొంది. SplashScreen API అనే యాప్.. ఆంబ్రియాడ్ 12 (GO Edition)తో రాబోతుంది. ఇందులో యాప్ ఐకాన్ స్ర్కీన్ మధ్యలో కనిపిస్తుంటుంది. యూజర్లకు యాప్ ఇంటర్‌ఫేస్‌పై కనిపించడానికి ముందే యాప్ బ్యాక్ గ్రౌండ్‌లో API లోడ్ అయ్యేందుకు అనుమతిస్తుంది. వచ్చే ఏడాదిలో రాబోయే సరసమైన స్మార్ట్ ఫోన్లలో ఈ ఆండ్రాయిడ్ గో వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ రానుంది. తద్వారా ఆయా ఫోన్లలో మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించనుంది. ఎందుకంటే.. బ్యాక్ గ్రౌండ్ లో అనవసరమైన యాప్స్‌ను ఈ ఓఎస్ హైబర్నేట్ చేస్తుంది..
రాబోయే అన్ని ఆండ్రాయిడ్ గో వెర్షన్ స్మార్ట్ ఫోన్లలో Files Go అనే యాప్ ఉంటుంది. Google ప్రకారం.. ఆండ్రాయిడ్ ఫోన్లలో తొలగించిన ఫైళ్లను 30 రోజులులోగా రీస్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. Nearby Share, Google Play యూజర్లు తమ డేటాను ఒకరితో ఒకరు నేరుగా యాప్‌ల నుంచి సేవ్ చేసుకోవచ్చు. Android 12 యాప్‌లు మీ డివైజ్ మీ డేటాను ఎప్పుడు యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయొచ్చు. Google ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌ను Android 12 (Go ఎడిషన్)లో యాడ్ చేసింది. దీని ద్వారా మీ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ ద్వారా మీ డేటాను ఎప్పుడు ఏ యాప్‌లు యాక్సెస్ చేస్తున్నాయో టైమ్‌లైన్ చెక్ చేసేందుకు అనుమతిస్తుంది.
Read Also : WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!