×
Ad

Delivery Spacecraft : వావ్.. ప్రపంచంలోనే ఫస్ట్ డెలివరీ స్పేస్‌క్రాఫ్ట్.. జస్ట్ గంటలోపే అంతరిక్షం నుంచి భూమిపై ఎక్కడికైనా.. ఆర్క్ ఏంటి? ఇదేలా పనిచేస్తుందంటే?

Delivery Spacecraft : ప్రస్తుత టెక్నాలజీతో ఎయిర్ డెలివరీకి 12 నుంచి 24 గంటలు పడుతుంది. కానీ, స్పేస్‌క్రాఫ్ట్ డెలివరీ కేవలం ఒక గంటలోనే పూర్తి చేయగలదు.

Delivery Spacecraft

Delivery Spacecraft : ప్రస్తుత రోజుల్లో ఏదైనా వేగంగా డెలివరీ చేయడం చాలా కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. ఎంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఒక చోట నుంచి మరో చోటుకు ఏదైనా తరలించాలంటే చాలా సమయం పడుతుంది. ఇకపై అలాంటి ఆలస్యమే ఉండదు. ఎందుకంటే.. ఇప్పుడు కొత్త డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. అదే ప్రపంచంలోనే ఫస్ట్ డెలివరీ స్పేస్‌క్రాఫ్ట్ ఆర్క్.. అంతరిక్షం నుంచి భూమిపై ఏ మూలకైనా అవసరమైన వస్తువులను ఇప్పుడు గంటలోనే వేగంగా తీసుకెళ్లగలదు.

అయితే, ఈ డెలివరీ అనేది భూమిపైనే కాదు.. అంతరిక్షం నుంచి కూడా భూమిపైకి డెలివరీ చేస్తుంది. ప్రపంచ లాజిస్టిక్స్ భవిష్యత్తును మార్చేందుకు అమెరికాకు చెందిన ఇన్వర్షన్ అనే స్టార్టప్ ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఆర్క్ తయారుచేసింది. మన గ్రహంపై ఏ మూలకైనా వస్తువులను వేగంగా డెలివరీ చేయగల విప్లవాత్మక అంతరిక్ష డెలివరీ వ్యవస్థను కంపెనీ ఆవిష్కరించింది.

ఇది ఒకేసారి 500 పౌండ్ల (సుమారు 225 కిలోగ్రాములు) వస్తువులను డెలివరీ చేయగలదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పటివరకు 4 కన్నా ఎక్కువసార్లు టెస్టింగ్ జరిగింది. వచ్చే ఏడాదిలో అమెరికా మిలిటరీ కోసం వినియోగించనున్నారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy A55 5G : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

స్పేస్‌క్రాఫ్ట్ ఆర్క్ ఏంటి? :

ఆర్క్ అనేది ఒక లిఫ్టింగ్-బాడీ స్పేస్‌క్రాఫ్ట్. అంటే.. ఇది వింగ్స్ లేదా రన్‌వే అవసరం లేకుండా భూమి వాతావరణంలోకి చేరుకోగలదు. సుమారు 8 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉంటుంది. పారాచూట్ సిస్టమ్ ద్వారా భూవాతావరణంలోకి ల్యాండ్ అవుతుంది. బహిరంగ ప్రదేశాలు లేదా మారుమూల ప్రాంతాలలో కూడా దాదాపు ఎక్కడైనా ల్యాండ్ అవుతుంది.

ఇన్వర్షన్ సహ వ్యవస్థాపకులు జస్టిన్ ఫియాసెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్ ఇటీవలే అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్క్‌ను ఆవిష్కరించారు. ఇది కక్ష్య నుంచి భూమికి సరుకును డెలివరీ చేసేందుకు రూపొందించిన లిఫ్టింగ్-బాడీ స్పేస్‌క్రాఫ్ట్. యూఎస్ మిలిటరీ కోసం రూపొందించారు. గంటలోపు ప్రపంచంలోని ఏ మూలకైనా 225 కిలోగ్రాముల వరకు సరుకును రవాణా చేయగలదని ఆర్స్ టెక్నికా తెలిపింది.

ప్రత్యేకత ఏమిటంటే.. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే అవసరం లేదు. పారాచూట్ సహాయంతో ల్యాండ్ అవుతుంది. ఇది ఏ ప్రదేశానికైనా చేరుకోగలదు. కంపెనీ ప్రకారం.. దాదాపు 5 సంవత్సరాలు అంతరిక్షంలో ఉండగలదు. మెడికల్ కిట్‌ల నుంచి డ్రోన్‌లు, ఇతర వస్తువుల వరకు ప్రతిదీ డెలివరీ చేయగలదు.

కంపెనీ ప్రకారం.. మొదటి ఆర్క్‌ను 2026 నాటికి ప్రయోగించవచ్చు. దీన్ని మొదట అమెరికన్ ఆర్మీ ఉపయోగిస్తుంది. ఆ తరువాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 12 గంటల నుంచి 24 గంటలు పట్టే ఎయిర్ డెలివరీ ఇప్పుడు కేవలం ఒక గంటలోనే సాధ్యమవుతుంది.

స్పేస్‌క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుందంటే? :

ప్రయోగం : ఆర్క్ ఒక రాకెట్ ద్వారా తక్కువ భూమి కక్ష్య (LEO)లోకి ప్రవేశపెడతారు. అవసరమైనంతవరకు అలానే ఉంచుతారు. ఆదేశం అందిన వెంటనే ప్రయోగిస్తారు.

కమాండ్ : అవసరమైనప్పుడు ఇది గ్రౌండ్ కంట్రోల్ నుంచి సంకేతాలను అందుకుంటుంది. ఆర్క్ స్వయంప్రతిపత్తితో భూ వాతావరణంలో తిరిగి ప్రవేశిస్తుంది. ఈ వాతావరణంలో 1000 కి.మీ క్రాస్-రేంజ్ విన్యాసాలు చేయగల లిఫ్టింగ్ బాడీ కలిగి ఉంది.

డెలివరీ, ల్యాండింగ్ : ఈ క్రాఫ్ట్ స్పీడ్ మాక్ 20 కన్నా ఎక్కువగా ఉంటుంది. రక్షణ కోసం హీట్ షీల్డ్‌లు అమర్చి ఉంటాయి. పారాచూట్‌లను ఉపయోగించి సాఫ్ట్ ల్యాండింగ్ చేయొచ్చు. రన్‌వే అవసరం ఉండదు. అంతేకాదు మైదానంలో కూడా ల్యాండింగ్ అవుతుంది.

పేలోడ్ డెలివరీ : ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఏ సరుకునైనా సురక్షితంగా తీసుకెళ్లగలదు. ప్రస్తుతం ఇది ఒకసారి మాత్రమే ఉపయోగించలరు. అందుకే నౌకాదళంలో అనేక ఆర్క్‌లను తప్పక కలిగి ఉండాలి.

ఎన్నో సవాళ్లు:
స్పేస్ క్రాఫ్ట్ ఆర్క్ కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. అందులో అతిపెద్ద సవాలు ఏమిటంటే.. అది కక్ష్యలోకి తిరిగి ప్రవేశించడం. ఈ సమయంలో ఉష్ణోగ్రత 3 వేల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అయితే, ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కానీ, ఇన్వర్షన్ ద్వారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అందుకే నిజమైన గేమ్ ఛేంజర్‌గా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఆర్క్ సైన్యం కోసం తయారు చేశారు. కానీ, ఆ తరువాత ఇది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రావొచ్చు. ఇలాంటి పరిస్థితిలో భద్రతపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

 స్పేస్ డెలివరీ ప్లాన్ ఎలా? :

బోస్టన్ యూనివర్శిటీలో విద్యార్థులుగా ఉన్న ఫియాసెట్టి ఆస్టిన్ 2021లో ఇన్వర్షన్‌ను స్థాపించారు. చదువుకునే సమయంలోనే ఫియాసెట్టి స్పేస్, స్పేస్‌ఎక్స్‌లో కూడా ఇంటర్న్‌షిప్ చేశారు. అక్కేడ ప్రొపల్షన్‌పై కూడా వర్క్ చేశాడు. ఒక రోజున స్పేస్ డెలివరీ గురించి ఆలోచన వచ్చింది. చదువు మానేసి ఇన్వర్షన్‌ను కనుగొన్నాడు. అంతరిక్షం గురించి మాట్లాడటం సరదాగా ఉన్నప్పటికీ, అంతరిక్షాన్ని నిజమైన ఆర్థిక విలువను ప్రపంచానికి తీసుకురావడమే లక్ష్యమని ఫియాసెట్టి వివరించాడు.

Read Also : Flipkart Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. బ్యాంకు ఆఫర్లు, స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!

కేవలం డేటాను మాత్రమే కాకుండా అంతరిక్షం నుంచి ఏదైనా వస్తువులను డెలివరీ చేయగలదు. సరిగ్గా 3 ఏళ్ల తరువాత 2024లో కంపెనీ కేవలం 25 మంది సిబ్బందితో రే అనే చిన్న అంతరిక్ష నౌకను నిర్మించింది. ఆ ఏడాదిలో స్పేస్‌ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్-12 మిషన్‌లో భాగంగా ప్రయోగించారు. ఇంజిన్ మొదట అంతరిక్షంలోకి నడిపించి తరువాత కక్ష్యలోకి వెళ్లి కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయింది.

ఇదో గేమ్ ఛేంజర్ :
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు స్పేస్ డెలివరీ వినియోగించుకోవచ్చు. విపత్తు ప్రాంతాలకు మెడిసిన్స్ పంపేటప్పుడు లేదా సరిహద్దులకు సరఫరా చేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వరదలు, భూకంపాల సమయంలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే మందులు, టీకాలు లేదా ఆహార సామాగ్రిని విపత్తు ప్రాంతాలకు కేవలం ఒక గంటలోపు అందించగలదు. 2026లో ఈ స్పేస్‌క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే, 2027 లేదా తరువాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రావొచ్చు.