×
Ad

Apple AirPods 4 Price : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. అతి చౌకైన ధరకే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple AirPods 4 Price : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ కావాలా? అమెజాన్ సేల్‌లో ఆపిల్ ఎయిర్ పాడ్స్ 4 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Apple AirPods 4 Price

Apple AirPods 4 Price : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా అమెజాన్‌లో అనేక గాడ్జెట్‌లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు లేదా ఇయర్‌బడ్‌లు డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి.

మీకు నచ్చిన ఆపిల్ ఎయిర్‌పాడ్స్ తగ్గింపు (Apple AirPods 4 Price) ధరలో కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్ సమయంలోనే డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధర కూడా భారీ తగ్గింపు పొందింది. ఆపిల్ ఇయర్‌బడ్స్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 ధర తగ్గింపు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల ధర రూ.10,999కి అందుబాటులో ఉన్నాయి. అసలు ధర రూ.12,999 నుంచి తగ్గాయి. అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు రూ.4వేలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, కనీస లావాదేవీ వాల్యూ రూ.99,990 అయితేనే ఈ తగ్గింపు పొందగలరని గమనించాలి. అంతేకాకుండా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కొనుగోలుతో ఈ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 ధర రూ.1,500కి తగ్గింపు పొందవచ్చు.

Read Also : Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. మీరు ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 కస్టమ్ హై-ఎక్స్‌కర్షన్ ఆపిల్ డ్రైవర్‌లతో వస్తుంది. హై క్వాలిటీ ఆడియోను అందిస్తాయి. కాన్వర్జేషన్ అవేర్‌నెస్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎయిర్‌పాడ్స్4లోని బెస్ట్ ఫీచర్లలో ఒకటి లైవ్ ట్రాన్స్‌లేషన్.. వివిధ ప్రాంతాలకు తరచుగా ప్రయాణించే అద్భుతంగా ఉంటుంది. ఇయర్‌బడ్‌లు H2 హెడ్‌ఫోన్ చిప్‌లో రన్ అవుతాయి.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ దుమ్ము, చెమట నీటి నిరోధకతకు IP54 సర్టిఫికేషన్‌ కూడా కలిగి ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే.. 5 గంటల బ్యాటరీ, కేస్ పూర్తిగా ఛార్జ్ చేశాక 30 గంటల వరకు అందిస్తాయి. అయినప్పటికీ, యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ (ANC) ఆన్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ లైఫ్ 4 గంటలకు, కేస్ బ్యాటరీ ఛార్జ్ 20 గంటలకు తగ్గుతుంది.