Apple Awe Dropping Event
Apple Awe Dropping Event : ఆపిల్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఆపిల్ ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9, 2025న జరగనుంది.
కంపెనీ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి అనేక ప్రొడక్టులను లాంచ్ చేయవచ్చు.
అదే సమయంలో, ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌లో అనేక రకాల అప్‌గ్రేడ్‌లను కూడా రిలీజ్ చేయనుంది. iOS 26 కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ అవే డ్రాపింగ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎలా చూడాలి? :
ఈ ఆపిల్ ఈవెంట్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం.. భారతీయ యూజర్లకు ఈ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. అయితే, అమెరికాలో ఉదయం 10:00 PT, మధ్యాహ్నం 1:00 ET గంటలకు చూడవచ్చు. ఇతర దేశాల్లో ఈ ఆపిల్ ఈవెంట్ దుబాయ్‌లో రాత్రి 9:00 గంటలకు (GST), కెనడాలో మధ్యాహ్నం 1:00 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలంటే.. ఈ ఈవెంట్‌ను చూసేందుకు ఆపిల్ అనేక ప్లాట్‌ఫామ్‌లను యాక్సస్ అందిస్తుంది. మీరు ఆపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, ఆపిల్ వెబ్‌సైట్, ఆపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. మీరు ఆపిల్ పార్క్‌లో లేకపోయినా,ఇంట్లో కూర్చొని లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
గత కొన్ని ఏళ్లుగా ఆపిల్ ట్రాక్ రికార్డ్ ప్రకారం.. అంచనా వేసిన ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్, సేల్స్, iOS 26 రిలీజ్ తేదీలను రివీల్ చేసింది. ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతాయి, ఎందుకంటే.. ఆపిల్ సాధారణంగా ఐఫోన్ లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రీ-ఆర్డర్లను ఓపెన్ చేస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్లు అతి త్వరలో ప్రారంభమవుతాయి.
సెప్టెంబర్ 19 నుంచి ఐఫోన్ 17 సేల్ :
ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12న ప్రారంభమైతే అధికారికంగా సెప్టెంబర్ 19 శుక్రవారం అమ్మకానికి రావచ్చు. ఎందుకంటే.. ఐఫోన్ అసలు అమ్మకాలు ప్రీ-ఆర్డర్ తర్వాత ప్రారంభమవుతాయి.
iOS 26 అప్‌డేట్ సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఆపిల్ ఐఫోన్ ఈవెంట్ తర్వాత మొదటి సోమవారం iOS అప్ డేట్స్ రిలీజ్ చేయనుంది. iOS 26 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 సిరీస్ :
ఈ కొత్త సిరీస్‌లో ఆపిల్ గత ఏడాది మాదిరిగానే 4 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే, ఈసారి కంపెనీ ప్లస్ మోడల్‌ను లాంచ్ చేయదు. ఆ స్థానంలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ప్రవేశపెట్టనుంది. కంపెనీ ఇప్పటివరకు అందించే అత్యంత సన్నని ఐఫోన్ కానుంది.
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ కాకుండా కంపెనీ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 17 డిజైన్ గత ఏడాది లాంచ్ ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్స్ కూడా ఇలాంటి డిజైన్‌తో రావచ్చు.
ఎంత ఖర్చవుతుంది? :
ఇటీవల లీక్ డేటా ప్రకారం.. ఆపిల్ ఈ కొత్త సిరీస్‌ను దాదాపు 50 డాలర్ల ధరకు అందించనుంది. గత ఏడాదిలో కన్నా దాదాపు రూ.4వేలు ఎక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.84,900. అదే సమయంలో, ఐఫోన్ 17 ఎయిర్‌ను రూ.1,09,900, ఐఫోన్ 17 ప్రోను రూ.1,24,900, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను రూ.1,64,900 ధరకు లాంచ్ చేయొచ్చు.
కొత్తగా ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చు? :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో డిస్ ప్లే నుంచి కెమెరా వరకు అనేక అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. ఈ ఏడాదిలో లాంచ్ అయ్యే అన్ని ఐఫోన్ మోడల్‌లు OLED డిస్ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అదే సమయంలో, ఈసారి ఐఫోన్ 17 సిరీస్ గత మోడల్ కన్నా భారీ బ్యాటరీతో రావచ్చు. ఐఫోన్ 17 ప్రో మోడల్ 5100mAh వరకు బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐఫోన్ మోడళ్ల కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది.