Apple India Diwali sale begins on September 26, free gifts are possible
Apple India Diwali Sale : ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో దీపావళి సేల్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్‌లు సెప్టెంబర్ 26న లైవ్ అవుతాయని కంపెనీ ధృవీకరించింది. వచ్చే వారంలో ఆపిల్ ఇండియా డీల్స్ గురించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కొన్ని లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లు ఉంటాయని తెలిపింది.
Apple India Diwali sale begins on September 26, free gifts are possible
ఐఫోన్‌ల కొనుగోలుపై ఉచితంగా బహుమతులను అందించే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్ 13 (Apple iphone 13), ఐఫోన్ 13 మినీ (iPhone 13mini)తో ఉచిత ఎయిర్‌పాడ్‌లను ఆఫర్ చేస్తుందని భావిస్తున్నారు. గత ఏడాదిలో కంపెనీ ఐఫోన్ 12 (iPhone 12) మినీ వెర్షన్‌తో ఉచితంగా ఎయిర్‌పాడ్‌లను అందించింది. 2020లో Apple iPhone 11 సిరీస్‌తో కూడా అదే పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది కూడా ఇదే విధమైన ఆఫర్‌ను పొందవచ్చు. Apple iPhoneలపై ఎలాంటి ఫ్లాట్ డిస్కౌంట్ అందించనుందో ప్రస్తుతానికి వెల్లడించలేదు.
ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ సందర్భంగా కంపెనీ ఇటీవల ఐఫోన్ 13 ధర (iPhone 13 Price)ను తగ్గించింది. Apple మరింత డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందని చెప్పలేం. కానీ, బ్యాంకు కార్డుల ఆధారంగా డిస్కౌంట్లను అందించే అవకాశాలు ఉన్నాయి. ఐఫోన్ 13 ఇప్పుడు అధికారికంగా రూ. 69,900గా ఉంది.
Apple India Diwali sale begins on September 26, free gifts are possible
అయినప్పటికీ, ఆసక్తి గల కస్టమర్‌లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో ఈ పరికరాన్ని రూ. 56,990 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. సెప్టెంబర్ 22న ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ.48వేలకి విక్రయిస్తోంది. కానీ, పరిమిత కాల డీల్‌గా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు ధర రూ.56,990కి పెరిగింది.
అదృష్టవంతులు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, iPhone 12 అమెజాన్‌లో రూ. 42,999కి అందుబాటులో ఉంది, ఇప్పుడు రూ. 44,999కి సేల్ అందుబాటులో ఉంది. ఆపిల్ ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, ఇయర్‌ఫోన్‌ల వంటి ప్రొడక్టులపై డిస్కౌంట్‌లను అందిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. ఆపిల్ ప్రొడక్టులపై ఎలాంటి ఆఫర్లు ఉంటాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.