iPhone 14 Car Crash : ఐఫోన్ 14లో కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. కారు యాక్సిడెంట్ లైవ్ టెస్టు చేసిన యూట్యూబర్..!

iPhone 14 Car Crash : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవలే కొత్త ఐఫోన్ 14 ఫోన్‌ (Apple iPhone 14) సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) వేరియంట్లలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (Crash Detection Feature) ఫీచర్‌ తీసుకొచ్చింది.

iPhone 14 Car Crash : ఐఫోన్ 14లో కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. కారు యాక్సిడెంట్ లైవ్ టెస్టు చేసిన యూట్యూబర్..!

iPhone 14 can detect car crash, so YouTuber performs a car accident to test the feature

iPhone 14 Car Crash : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవలే కొత్త ఐఫోన్ 14 ఫోన్‌ (Apple iPhone 14) సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) వేరియంట్లలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (Crash Detection Feature) ఫీచర్‌ తీసుకొచ్చింది. యూజర్ ప్రయాణించే కారు ప్రమాదాన్ని ముందుగానే ఈ ఫీచర్ గుర్తిస్తుంది.

వెంటనే ఎమర్జెన్సీ కాల్‌లను ఆటోమాటిక్‌గా డయల్ చేస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసేందుకు యూట్యూబర్ కారు యాక్సిడెంట్ టెస్ట్ నిర్వహించాడు. TechRaxకు చెందిన యూట్యూబర్ కొత్త ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro)ను 2005 మెర్క్యురీ గ్రాండ్ మార్క్విస్ సెడాన్ ముందు సీటుకు బెల్ట్ వేసి పాత కార్ల కుప్పపైకి దూసుకెళ్లాడు. అందులో వెంటనే కారు క్రాష్‌ను గుర్తించిన ఆపిల్ కొత్త ఫీచర్ యాక్టివేట్ అయింది.

iPhone 14 can detect car crash, so YouTuber performs a car accident to test the feature

iPhone 14 can detect car crash, so YouTuber performs a car accident to test the feature

TechRax మొత్తం కారు యాక్సెడింట్ టెస్టు ప్లాన్ చేశాడు. రిమోట్ కంట్రోల్డ్ ద్వారా కారుతో క్రాష్ చేశాడు. కొత్త ఐఫోన్ 14 Pro కారు ప్రమాదాన్ని గుర్తించి.. ఎమర్జెన్సీ నంబర్‌ను డయల్ చేసింది. యూట్యూబర్ రికార్డు చేసిన వీడియోలో కారును రెండుసార్లు క్రాష్ చేయడం చూడవచ్చు. మొదటి రౌండ్‌లో క్రాష్ లైట్ ఎఫెక్ట్ కలిగి ఉంది. ఆ తర్వాతి రౌండ్‌లో కారును అతివేగంతో ఢీకొట్టాడు.

టెస్టింగ్ సమయంలో.. ప్రమాదం జరిగిన 10 సెకన్లలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయింది. క్రాష్‌ను గుర్తించిన వెంటనే ఐఫోన్ 14 ప్రో క్రాష్ యూజర్ ఫ్లాష్ వార్నింగ్ అలారంను మోగించింది. ఎమర్జెన్సీ స్లయిడర్ కూడా స్క్రీన్‌పై కనిపించింది. అదే సమయంలో కాల్ చేయడం లేదా వార్నింగ్ మెసేజ్ పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఆ తర్వాత డివైజ్ యూజర్ నుంచి రెస్పాన్స్ కోసం 20 సెకన్ల పాటు వేచి ఉండి, ఆపై ఆటోమాటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ వెళ్తుంది.

iPhone 14 can detect car crash, so YouTuber performs a car accident to test the feature

iPhone 14 can detect car crash, so YouTuber performs a car accident to test the feature

ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఎలా పనిచేస్తుందంటే? :
Apple iPhone 14 సిరీస్‌లో 256F పవర్ గుర్తించగల కొత్త సెన్సార్‌లను ఉపయోగిస్తోంది. ఇంటర్నల్ హై-డైనమిక్ రేంజ్ గైరోస్కోప్, కొత్త డ్యూయల్-కోర్ యాక్సిలెరోమీటర్ క్రాష్ ద్వారా ప్రెజర్ రికార్డ్ చేస్తుంది. వినియోగదారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డేటాను ప్రాసెస్ చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ SOS సర్వీసుతో డివైజ్‌ను కనెక్ట్ చేస్తుంది. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైన ఆపిల్ వాచ్ సిరీస్ 8, Watch Ultraలో కూడా లాంచ్ అయింది. ఇందులోనూ అనేక సెన్సార్‌లను కలిగి ఉంది. ఐఫోన్ 14 యూజర్లు మెడికల్ ఐడీలను కూడా ఫోన్‌లో సెటప్ చేసుకోవచ్చు.

ఫోన్‌ను మెడికల్ ID స్లయిడర్‌ని డిస్‌ప్లే చేసేందుకు అనుమతిస్తుంది. ముందుగా స్పందించేవారికి మెడికల్ అసిస్టెన్స్ యాక్సెస్ అందించడంలో సాయపడుతుంది. ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ప్యాసింజర్ కార్లు, SUVలు, పికప్ ట్రక్కులతో సహా అత్యంత సాధారణ వాహనాలలో పనిచేస్తుందని ఆపిల్ క్లారిటీ ఇచ్చింది. అయితే, మీరు బైక్ ప్రమాదానికి గురైతే ఈ ఫీచర్ పనిచేయకపోవచ్చు. ఐఫోన్ 14 సిరీస్, లేటెస్ట్ Apple వాచ్ మోడల్‌లలో (వాచ్ SE మినహా) ఫీచర్ డిఫాల్ట్‌గా పనిచేస్తోంది.

Read Also : iPhone 14 Features : ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 13 ఒకేలా లేవు.. ఫ్రంట్ డిజైన్ సేమ్.. ఇంటర్నల్‌గా బిగ్ ఛేంజ్..!