Apple India Website Down : మరికొద్ది గంటల్లో ఐఫోన్ 16 సిరిసీ ప్రీ-ఆర్డర్లు.. అంతలోనే ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ డౌన్..!

Apple India Website Down : ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ ఆర్డర్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. ఆపిల్ స్టోర్ కొన్ని గంటల్లో వెబ్‌సైట్ కార్యకలాపాలను రీస్టోర్ చేయనుంది.

Apple India website is down just hours ahead of iPhone 16 pre-orders

Apple India Website Down : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ మరికొద్ది గంటల్లో ప్రీ-ఆర్డర్ సేల్ మొదలు కానుంది. ఇంతలోనే ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ డౌన్ అయింది. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు.

Read Also : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఇవి తప్పక గుర్తుంచుకోండి!

ఎందుకంటే.. ఆపిల్ ఐఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం వినియోగదారులు ఎక్కువ మంది విజిట్ చేయడంతో ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ ఒక్కసారిగా స్తంభించింది. ఐఫోన్ ప్రీ-బుకింగ్ చేసుకోవడం మరింత కష్టంగా మారింది. భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ధర గత ఏడాది మోడళ్లకు అనుగుణంగా ఉంటుందని నివేదికలు సైతం వెల్లడించాయి.

ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ డౌన్ :
ఐఫోన్ 16 ప్రీ ఆర్డర్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. ఆపిల్ స్టోర్ కొన్ని గంటల్లో వెబ్‌సైట్ కార్యకలాపాలను రీస్టోర్ చేయనుంది. కొత్త ఆపిల్ గాడ్జెట్‌లను భద్రపరచడానికి ఆసక్తి ఉన్న కస్టమర్‌లు, స్టోర్‌ను నిశితంగా పర్యవేక్షించడం మంచిది. ఎందుకంటే.. ఐఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు సాయంత్రం 5:30 నుంచి ప్రారంభమవుతాయి.

ఆపిల్ లాంచ్ టైమ్‌లైన్ ప్రకారం.. ఈ ఐఫోన్ల షిప్పింగ్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లోని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను ప్రమోట్ చేస్తోంది. అయితే, ఇవి లాంచ్‌లో అందుబాటులో ఉండవు. కొత్త సామర్థ్యాలు వచ్చే నెల ఐఓఎస్ 18.1తో ప్రారంభం కానున్నాయి. అన్ని ఐఫోన్ 16 మోడల్‌లు ఆపిల్ ఇంటిలిజెన్స్‌కు సపోర్టు ఇచ్చేలా రూపొందించంది.

హార్డ్‌వేర్ వారీగా పరిశీలిస్తే..
ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ భారీ స్క్రీన్‌లు, కొత్త చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ, కొత్త 48ఎంపీ (అల్ట్రా-వైడ్) ట్రిపుల్ కెమెరా సెటప్, డెడికేటెడ్ కెమెరా కంట్రోల్ బటన్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తాయి. ఐఫోన్ వైపున ఉన్న ఈ బటన్ ఫొటో, వీడియో క్యాప్చర్‌ను సులభతరం చేస్తుంది. జూమ్ వంటి సెట్టింగ్‌లను కంట్రోల్ చేసేందుకు స్వైప్ యాక్టివిటీని అందిస్తుంది. బేస్ మోడల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లు కూడా కెమెరా కంట్రోల్, యాక్షన్ బటన్‌లను కలిగి ఉన్నాయి. గతంలో ప్రో మోడల్‌ల కోసం రిజర్వ్ అయ్యాయి. ప్రామాణిక మోడల్‌లు కొత్త చిప్‌సెట్, కొత్త కలర్, భారీ బ్యాటరీతో వస్తాయి.

ఐఫోన్ 16 సిరీస్ ధరలివే :
ఆపిల్ ఐఫోన్ 16 వివిధ రకాల స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌, ధరలలో వస్తుంది. 128జీబీ స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వెర్షన్ ధర రూ.89,900కు అందిస్తుంది. ఇంకా ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే యూజర్లకు 512జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900కు అందిస్తోంది. ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ మోడల్‌కు రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 99,900, రూ. 1,19,900కు అందుబాటులో ఉంటాయి.

మీరు ఐఫోన్ 16 ప్రో కోసం చూస్తుంటే.. 128జీబీ మోడల్‌ రూ. 1,19,900 ప్రారంభ ధరతో వస్తుంది. ఆపిల్ 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. ఈ ఐఫోన్ల ధర వరుసగా రూ.1,29,900, రూ.1,49,900, రూ.1,69,900కు అందిస్తోంది. అత్యంత ప్రీమియం మోడల్ కావాలనుకునే వారికి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్‌కు ధర రూ. 1,44,900 నుంచి ప్రారంభం కానుంది. 512జీబీ వెర్షన్ ధర రూ. 1,64,900 కాగా, టాప్-టైర్ 1టీబీ మోడల్ ధర రూ. 1,84,900కు అందిస్తోంది.

Read Also : iPhone 16 Pre-order Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. ఆఫర్లు, డీల్స్ మీకోసం..!