Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై రూ.39,500 తగ్గింపు.. కేవలం రూ. 19,400 మాత్రమే..!

Flipkart Winter Sale : ఇటీవలే ఆపిల్ ఐఫోన్ సిరీస్‌ లాంచ్ అయిన వెంటనే ఆపిల్ పాత ఐఫోన్ 13 ధరను గణనీయంగా తగ్గించింది. ఇది గతంలో కంటే ఇప్పుడు చౌకగా ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై రూ.39,500 తగ్గింపు.. కేవలం రూ. 19,400 మాత్రమే..!

Apple iPhone 13 gets Rs 39,500 off in Flipkart Winter Sale

Flipkart Winter Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే వింటర్ సేల్‌లో (Apple iPhone 13) భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ఇప్పుడు ఆపిల్ అధికారిక స్టోర్‌లో చౌకైన ధరకే అందుబాటులో ఉంది. 2021లో ఐఫోన్ 13 రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ ఆపిల్ స్టోర్‌లో రూ. 59,900 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి మాత్రం కేవలం రూ. 19,400 ధరకే ఐఫోన్ 13ని కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై రూ. 58వేల లోపు ధరకే సొంతం చేసుకోండి.. ఈ డీల్ పొందాలంటే?

ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్లతో మరింత తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1000 తగ్గింపు తర్వాత ఐఫోన్ 13 ధర రూ. 58,900 వద్ద జాబితా అయింది. దాంతో పాటు, కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 13 ధరను రూ.56,900కి తగ్గించింది. ఇది కాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 37,500 వరకు తగ్గింపును పొందవచ్చు.

అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో కలిపి కొనుగోలుదారులు ఐఫోన్ 13ని ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 19,400కి సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13 మోడల్ ఐఫోన్ 14 వంటి స్పెషిఫికేషన్లతో చాలా తక్కువ ధరకు అందిస్తుంది. మీరు ఐఫోన్ 13 కన్నా బడ్జెట్‌లో ప్రీమియం ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

Apple iPhone 13 gets Rs 39,500 off in Flipkart Winter Sale

Apple iPhone 13

ఐఫోన్ 15 లాంచ్ తర్వాత భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర :
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 13 ధరను గణనీయంగా తగ్గించింది. గతంలో కన్నా ఇప్పుడు చౌకైన ధరకే పొందవచ్చు. ఐఫోన్ 13 4కె డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్‌తో 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. నైట్ మోడ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతుంది.

ఈ ఐఫోన్ డివైజ్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గతేడాది జరిగిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13 బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఐఫోన్ 13 ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్‌లలో ఒకటిగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలోనూ అద్భుతమైన స్పందన లభించింది.

Read Also : iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు.. ఈ డీల్ పొందాలంటే?