Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ మొదలైందోచ్.. ఇకపై లేటెస్ట్ ఐఫోన్లన్నీ చెన్నైలోనే..!

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 తయారీని ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.

Apple iPhone 13 Made In India : ప్రపంచ దేశాలకు భారత్ మొబైల్ మార్కెట్ అతిపెద్ద బిజినెస్ మార్కెట్‌గా మారింది. ప్రముఖ పాపులర్ స్మార్ట్ ఫోన్ మేకర్ల దృష్టి అంతా ఇప్పుడు భారత మార్కెట్‌పైనే.. భారత్ వేదికగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా మొబైల్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. భారత్ కేంద్రంగా తమ ప్రొడక్టులను తయారుచేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ నుంచి లేటెస్ట్ ఐఫోన్లను తయారుచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే Apple iPhone 13 ట్రయల్ తయారీని ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది.

దేశీయ మార్కెట్ ఎగుమతుల కోసం భారత్‌లో ఐఫోన్ 13 వాణిజ్య ఉత్పత్తిని ఆపిల్ ప్రారంభించింది. ఆపిల్ సెమీకండక్టర్ చిప్‌ల సరఫరా కూడా ప్రారంభించింది. భారత్‌లో ఆపిల్ ఫోన్లను ఉత్పత్తిని పెంచి గ్లోబల్ మార్కెట్లలో ఐఫోన్ 13 మోడల్ సరఫరా చేసేందుకు ఆపిల్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. అన్ని ఐఫోన్‌ల సరఫరా చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఐఫోన్ 13 లేటెస్ట్ సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. దేశంలో ఆపిల్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ను తయారు చేసేందుకు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఆపిల్ ఇప్పటికే చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 11, ఐఫోన్ 12లను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ SE (iPhone SE) బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు. భారత్‌లో ఆపిల్ విక్రయించే దాదాపు 70 శాతం స్మార్ట్‌ఫోన్‌లను దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఆపిల్ తమ లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌లన్నింటినీ తయారు చేస్తోంది.

Apple Iphone 13 Is Now Made In India, Manufacturing Begins At Chennai Plant 

ప్రస్తుతానికి ఐఫోన్ల తయారీపైనే దృష్టిపెట్టిన కంపెనీ ధరలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐఫోన్ 13ని తయారీ ప్రారంభించినట్టు ఆపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ Apple తయారీ భాగస్వాములైన Foxconn, Wistron, ఇప్పటికే ఓల్డ్ iPhone మోడల్‌లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే iPhone 13 ఫస్ట్ Foxcon భాగస్వామ్యంలో తయారు చేయనుంది ఆపిల్. ఇప్పటికే ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 11లను స్థానికంగా ఆపిల్ తయారు చేస్తోంది, ఇవి కేవలం వనిల్లా మోడల్‌లు మాత్రమే. ప్రస్తుతం ఇండియాలో ప్రో మోడల్‌లు తయారుచేయలేదు. స్థానిక కస్టమర్ల కోసం భారత్‌లో ఐఫోన్ 13ను తయారు చేస్తామని ఆపిల్ చెబుతోంది. భారత్‌లో ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇతర మార్కెట్‌లకు ఎగుమతి అయ్యే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐఫోన్ 13ను స్థానికంగా ఉత్పత్తి చేయాలనే నిర్ణయాన్ని ఆపిల్ గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. భారత్‌లో ఐఫోన్ 12 ఉత్పత్తి ప్రారంభించిన 8 నెలల తర్వాత ఈ ఐఫోన్ 13 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్త ఐఫోన్ మోడళ్లను స్థానిక తయారీతో ఆపిల్ వాల్యూమ్‌ను పెంచాలని యోచిస్తోంది. కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఆఫర్‌లు, డీల్‌, ఐఫోన్‌లను అందించనుంది. గత ఏడాదిలో ఆపిల్ ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. ఐఫోన్ షిప్‌మెంట్‌లు 5 మిలియన్ యూనిట్లతో రికార్డు స్థాయిలో 108 శాతం వృద్ధి చెందాయి. అంటే సుమారుగా 4 శాతం మార్కెట్ వాటాను అందించాయి. పెగాట్రాన్‌లో ఐఫోన్ 13 ఉత్పత్తి, ఐఫోన్ 12 ఉత్పత్తితో, ఆపిల్ ఇండియాలోనే ఐఫోన్ అమ్మకాలలో ప్రస్తుత రికార్డును అధిగమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Read Also : Apple Watch 6 Series : భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్ వాచ్‌..!

ట్రెండింగ్ వార్తలు