Apple Watch 6 Series : భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్ వాచ్‌..!

Apple Watch 6 Series : ఆపిల్ స్మార్ట్ వాచ్.. 34ఏళ్ల భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడింది. అతడికి గుండెపోటు రాబోతుందని ముందుగానే హెచ్చరించడంతో సకాలంలో ఆస్పత్రికి తరలించారు.

Apple Watch 6 Series : భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్ వాచ్‌..!

Apple Watch’s Ecg Feature Saves Life Of 34 Year Old Indian User

Apple Watch 6 Series : ఆపిల్ స్మార్ట్ వాచ్.. 34ఏళ్ల భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడింది. అతడికి గుండెపోటు రాబోతుందని ముందుగానే హెచ్చరించడంతో సకాలంలో ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆపిల్ స్మార్ట్ వాచ్ ముందుగా అలర్ట్ చేయకుండా ఉండి ఉంటే.. అతడి ప్రాణాలు పోయి ఉండేవి. గతంలోనూ ఆపిల్ స్మార్ట్ వాచ్ చాలామందిని ప్రాణాపాయ స్థితిలో కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆపిల్ వాచ్ (Apple Watch 6)లోని ECG ఫీచర్ అతడి ప్రాణాలను కాపాడటలో సాయపడింది. తాజాగా హర్యానాలోని యమునా నగర్‌లో నివసించే 34 ఏళ్ల నితీష్ చోప్రాకు ఉన్నట్టుండి చాతిలో నొప్పిగా అనిపించింది. వెంటనే నితీష్ ఆలస్యం చేయకుండా తన ఆరోగ్య పరిస్థితి గురించి భార్య నేహాకు చెప్పాడు.

నేహా గతేడాది తనకు బహుమతిగా ఇచ్చిన ఆపిల్ వాచ్ 6 (Apple Watch 6 Series) చేతికి ధరించమని చెప్పింది. ఆమె చెప్పినట్టుగా అతడు చేశాడు. ఆపిల్ వాచ్‌లో ECG చెక్ చేసుకున్నాడు. ఈసీజీ రీడింగ్‌లు చాలా తక్కువకు పడిపోయాయి. భార్య నేహా వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ అతడికి యాంజియోగ్రఫీ చేశారు. గుండె ధమనులలో 99.9 శాతం బ్లాక్‌లు ఉన్నాయని గుర్తించారు.

ఆపరేషన్ చేసిన డాక్టర్ అతని గుండెలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం నితీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. తన భర్త ప్రాణాలతో బయటపడటంతో నేహా (Apple CEO Tim Cook)కి ఒక ఈ-మెయిల్ పంపింది. Apple Watch 6 తన భర్త జీవితాన్ని ఎలా కాపాడిందో వివరించింది. తన భర్త ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Apple Watch’s Ecg Feature Saves Life Of 34 Year Old Indian User (1)

Apple Watch’s Ecg Feature Saves Life Of 34 Year Old Indian User 

Apple Watch 6 Series : ఆపిల్ వాచ్ 6 ధర ఎంతంటే? :
Apple Watch 6 ధర మార్కెట్లో రూ. 40,900గా ఉంది. Apple వాచ్ సిరీస్ 6(GPS + సెల్యులార్) ప్రారంభ ధర రూ. 49,900 నుంచి అందుబాటులో ఉంది. అయితే ఈ ఆపిల్ వాచ్ మోడల్స్ రెండు వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ వాచ్ 6 అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ Apple Watch వాచ్ సిరీస్ 6లో ఆక్సిమీటర్ సెన్సార్ ఉంటుంది.

ఈ ఫీచర్ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను మెజర్ చేయగలదు. Apple Watch Series S6 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో A13 బయోనిక్ ప్రాసెసర్ ఆప్టిమైజ్ వెర్షన్ అందించారు. స్మార్ట్ వాచ్ 40mm, 44mmతో సహా డ్యూయల్ సైజులలో వస్తుంది. IP68 సర్టిఫికేట్ పొందింది. అంటే.. నీటిలో పడినా పనిచేస్తుంది.. అలాగే దుమ్ము నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఆపిల్ కంపెనీ Apple Watch పలు సిరీస్ లను ఆవిష్కరించింది. అందులో Apple Watch Series 4, Apple Watch Series 5, Apple Watch Series 6, Apple Watch Series 7 స్మార్ట్ వాచ్ లను ప్రవేశపెట్టింది. ఈ ఆపిల్ వాచ్ అన్ని సిరీస్ ల్లోనూ ECG డిటెక్ట్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

ఈ ECG ఫీచర్ చేతికి ధరించగానే.. హార్ట్ లో ఉండే ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీ మెజర్ చేస్తుంది. అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్టుగా ఉందోలేదో చెక్ చేస్తుంది. ఒకవేళ రెగ్యులర్ హార్ట్ బీట్ లేకుంటే మాత్రం వెంటనే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్‌ వాచ్‌కు రెడ్‌ సిగ్నల్స్‌ పంపుతుంది. ఈ సిగ్నల్స్ ద్వారా అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి వెళ్తే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు. భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కూడా ఈ ఆపిల్ వాచ్ ECG ఫీచర్ ఇలానే కాపాడింది.

Read Also : Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్ భారీ ఆఫర్.. ధర ఎంతంటే?