Apple iPhone 15 And Pro, Plus get massive discount on Vijay Sales
Apple iPhone 15 Series : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. విజయ్ సేల్స్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. కొన్ని నెలల క్రితమే భారత మార్కెట్లో లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో కనిపించే ఫ్లాట్ డిస్కౌంట్ మొత్తానికి అదనంగా కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ ధరలు, ఆఫర్‌లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
బ్యాంకు ఆఫర్లపై అదనంగా రూ. 3వేలు తగ్గింపు :
భారత మార్కెట్లో ఐఫోన్ 15 ప్రో బేస్ 128జీబీ వేరియంట్ ధర రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ సమయంలో ఐఫోన్ 15 ప్రో తగ్గింపు ధర రూ. 1,28,155కి విక్రయిస్తోంది. వినియోగదారులు రూ. 6,745 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 3వేల తగ్గింపు కూడా పొందవచ్చు.
అంటే.. ఐఫోన్ ప్రో ప్లస్ ధరను రూ.1,25,155కి తగ్గిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ అసలు రిటైల్ ధర రూ. 89,990 ఉండగా.. ఇప్పుడు 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 82,990కి తగ్గింది. విజయ్ సేల్స్ అదనంగా రూ. 4వేల తగ్గింపును కూడా అందిస్తోంది. దీని ధర ప్రభావవంతంగా రూ.78,990కి తగ్గుతుంది.
Apple iPhone 15 massive discount
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై మరింత తగ్గింపు :
స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్‌ను కొనుగోలు చేసే యూజర్లు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రూ. 72,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు. రూ. 4వేల బ్యాంక్ ఆఫర్‌తో రూ.68,990 వద్ద సమర్థవంతంగా పొందవచ్చు. లేటెస్ట్ ఐఫోన్‌పై ఇప్పటివరకు ఇదే అత్యల్ప తగ్గింపు ఆఫర్.
భారత మార్కెట్లో ఐఫోన్ 15 బేస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.79,900కి కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతానికి, ఈ సేల్ ఆఫర్ల గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ప్రస్తుతం విజయ్ సేల్స్ తమ ప్లాట్‌ఫారమ్‌లో మెగా రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 15 మోడళ్లపై భారీ తగ్గింపులను అందించడానికి ఇది కారణం కావచ్చు.
ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందనేది క్లారిటీ లేదు. కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న యూజర్లు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ డీల్ పొందే వినియోగదారులు అన్ని ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఓసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ 15 సిరీస్‌పై మరిన్ని తగ్గింపులను పొందడానికి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను కూడా ఎంచుకోవచ్చు. ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో వేర్వేరు సేల్ ఆఫర్‌లు, డీల్‌లు ఉన్నాయని గుర్తుంచుకోండి.