Black Friday Sale : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఎంత తగ్గిందంటే?

Black Friday Sale : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే ఆఫర్.. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా కొత్త ఐఫోన్ సిరీస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Apple iPhone 15 available with Rs 8,000 discount offer

Black Friday Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 15 సిరీస్ రూ. 8వేలు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఎందుకంటే ఆపిల్ ఈ ఐఫోన్ మోడల్ 3 నెలల క్రితమే భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా (iNvent) స్టోర్ ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్లపై రెండు ఆఫర్‌లను అందిస్తోంది. ఐఫోన్ 15 ధరను రూ.71,900కి తగ్గించింది. ఐఫోన్ 15 డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. కొత్త లీక్ డేటా ఇదిగో..!

ఐఫోన్ 15పై తగ్గింపు ఆఫర్‌ వివరాలు :
ప్రస్తుతం ఐఎన్వెంట్ స్టోర్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 రూ. 76,900 ప్రారంభ ధరతో అందిస్తుంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 79,900 నుంచి తగ్గింది. అంటే.. కస్టమర్లు రూ.3వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 5వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. దాంతో ఐఫోన్ ధర రూ.71,900కి తగ్గుతుంది. మొత్తం తగ్గింపు డివైజ్‌పై రూ. 8వేలు పొందవచ్చు. అయితే, ఈ ఐఫోన్ 15 డిస్కౌంట్ ఆఫర్ బ్లాక్ కలర్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఫోన్ 15 కొనుగోలు చేయాలా? వద్దా? :

భారత మార్కెట్లో దాదాపు రూ. 72వేలు ధరలో ఐఫోన్ 15 బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇందులో 4కె సినిమాటిక్ మోడ్, వేగవంతమైన చిప్‌సెట్, కొత్త పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, యూఎస్‌బీ-సి పోర్ట్‌కు సపోర్టుతో కొత్త 48ఎంపీ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇప్పుడు, యూఎస్‌బీ-సి పోర్ట్‌ని కలిగి ఉండనుంది. మీరు ఐఫోన్ 15 ప్రత్యేక ఛార్జింగ్ కేబుల్‌తో పాటు అడాప్టర్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ఏదైనా టైప్-సి ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. కొత్త మోడల్ మునుపటి మోడల్‌ల కన్నా కొంచెం ప్రకాశవంతంగా డిస్‌ప్లేను కలిగి ఉంది.

Apple iPhone 15  discount offer

వినియోగదారులు ప్రాథమిక వినియోగంతో ఒక రోజు కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. అంతేకాదు.. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు, ఐపీ68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఐఫోన్ 15 మొత్తం పనితీరు కూడా వేగంగా ఉంటుంది. ఐఫోన్ 15 మంచి డీల్‌ అని చెప్పవచ్చు.

మీరు గత వెర్షన్‌లతో పోల్చితే.. మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. మీ బడ్జెట్ దాదాపు రూ. 50వేలు అయితే, ఐఫోన్ 13ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఏదైనా బిగ్ సేల్ ఈవెంట్ల సమయంలో కొనుగోలు చేయడమే మంచిది. ఎక్కువ ఖర్చు చేయగలిగిన వినియోగదారులు ఐఫోన్ 15 కొనుగోలు చేయొచ్చు.

Read Also : Amazon Black Friday Sale 2023 : ఈ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆకర్షణీయమైన డీల్స్.. డోంట్ మిస్!