Apple iPhone 15 Discount : ఐఫోన్ 14 కన్నా అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 ధర తక్కువకు అందుబాటులో ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 14 ధర కన్నా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ఏ ఇతర ఫోన్లకు ఉండదు. చాలామంది ఐఫోన్ కొనాలని భావిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఐఫోన్ తక్కువ ధరకు వస్తుందంటే ఎవరూ మాత్రం కొనకుండా ఉంటారు.. ఐఫోన్ లవర్స్ అయితే మాత్రం ఈ అవకాశాన్ని అసలు వదులుకోరు. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 అనేది ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 15 సిరీస్‌లో చౌకైనదిగా చెప్పవచ్చు.

ఐఫోన్ 14 కన్నా తక్కువ ధరకే : 
అంతేకాదు.. అత్యంత విలువైన మోడల్‌లలో ఇదొకటి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఐఫోన్ 14 తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 కూడా ఉంది. రెండు నెలల క్రితమే లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14 కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో లాంచ్ సమయంలో 128జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 15 ధర రూ. 79,900 ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 42,500 తగ్గింపు తర్వాత కేవలం రూ. 37,400కి మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 16 Series : కొత్త యాక్షన్ బటన్‌తో ఐఫోన్ 16 సిరీస్ వస్తోంది.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు : 
కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 15 ధరను రూ.74,900కి పొందవచ్చు. అదనంగా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 15 ధరను రూ. 37,400కి తగ్గించింది. అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ఐఫోన్ 15ని రూ. 42,500 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 37,400కి పొందవచ్చు. ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 14 ధర రూ. 69,900కు కొనుగోలు చేయొచ్చు.

Apple iPhone 15 Flipkart Sale  

ఐఫోన్ 15 కెమెరా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
గత కొన్ని సంవత్సరాలలో ఐఫోన్ అందుకున్న అతిపెద్ద అప్‌గ్రేడ్ ఐఫోన్ అంటే.. ఐఫోన్ 15 మాత్రమే.. ఇప్పటివరకు లాంచ్ అయిన అత్యంత అధునాతన ఆపిల్ ఐఫోన్‌లలో ఇదొకటి. టన్నుల కొద్దీ కొత్త ఫీచర్లతో గత ఏడాది నుంచి గణనీయమైన అప్‌గ్రేడ్‌ ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 15 కొత్త 48ఎంపీ కెమెరా సెటప్, యూఎస్‌బీ-సి పోర్ట్, కొత్త చిప్‌సెట్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌లో కెమెరా కొత్త జనరేషన్ ఆపిల్ ఐఫోన్లలో అతిపెద్ద అప్‌డేట్. ఐఫోన్ 15, ఆపిల్ ఐఫోన్ 14 ప్రో వంటి 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను పొందుతుంది. 48ఎంపీ కెమెరా 12ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 15 ఎడ్జెస్ గత వెర్షన్ల మాదిరిగా ఫ్లాట్‌గా ఉండవు. కొత్త ఐఫోన్ అంచులు కొద్దిగా వంగి ఉంటాయి. పట్టుకోవాడానికి, క్యారీ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇక డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్‌తో స్లిమ్ బెజెల్స్, నాచ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఐఫోన్ ఫ్రాస్టెడ్ గ్లాస్, కొంచెం పెద్ద కెమెరా లెన్స్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ 15లో మరో గుర్తించదగిన మార్పు దిగువ అంచున యూఎస్‌బీ-సి పోర్ట్ ఉండటమే.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Read Also : Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా? సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు