Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా? సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 40వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజైన్, శక్తివంతమైన ఎ16 బయోనిక్ చిప్, 48ఎంపీ ప్రధాన కెమెరా ఉన్నాయి.

Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా? సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 can be effectively bought under Rs 40K on Flipkart and Amazon

Apple iPhone 15 Discount Sale : మీరు కొత్త ఐఫోన్ 15 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రస్తుత ఆఫర్లను ఓసారి చెక్ చేసుకోండి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తున్నాయి. మీరు ఇప్పటికే ఐఫోన్ యూజర్ అయితే, ఈ డీల్‌ అసలు మిస్ చేసుకోవద్దు.

మీ పాత ఐఫోన్లపై ట్రేడ్-ఇన్ వాల్యూతో ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ వంటి అంశాలను బట్టి రూ.37వేల వరకు ఉండవచ్చు. ఐఫోన్ 15 అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన డివైజ్‌లలో ఒకటిగా ఉంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరా, డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. గతంలో టాప్-టైర్ వేరియంట్‌లకు పరిమితం అయింది. ఈ డివైజ్ గణనీయమైన ఫీచర్లతో వస్తుంది. టెక్ ఔత్సాహికులు తమ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకునేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
మీరు ఆపిల్ ప్రొడక్టులకు మారాలని చూస్తున్నట్లయితే.. అమెజాన్ ద్వారా ఐఫోన్ 15ను కొనుగోలు చేయొచ్చు. 128జీబీ మోడల్ ఐదు శాతం తగ్గింపుతో రూ. 75,900 వద్ద లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, అమెజాన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ ద్వారా ధర రూ. 34,500 వరకు తగ్గించింది. తద్వారా ఐఫోన్ 15 ధర రూ. 41,400కి చేరుకుంది.

Read Also : Bajaj Chetak Urbane Launch : రూ. 1.15 లక్షల ధరతో బజాజ్ చేతక్ అర్బేన్ ఈవీ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 63కి.మీ దూసుకెళ్తుంది

అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్‌లో, రూ. 37,500 వరకు ఎక్స్ఛేంజ్ డీల్ అందిస్తుండగా.. ఎంపిక చేసిన మోడళ్లపై అదనంగా రూ. 3వేలు తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఈఎంఐ యేతర లావాదేవీలపై రూ. 5వేలు తగ్గింపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 5వేలు తగ్గింపు వంటి మరిన్ని ప్రోత్సాహకాలను కలిగి ఉంది. ఈ తగ్గింపులతో ఐఫోన్ 15 ధరను రూ. 40వేల కన్నా తక్కువకు పొందవచ్చు.

Apple iPhone 15 can be effectively bought under Rs 40K on Flipkart and Amazon

Apple iPhone 15 on Flipkart and Amazon

ఆపిల్ ఐఫోన్ 15ని అధీకృత ఆపిల్ విక్రయదారు అయిన (iNvent) స్టోర్ ద్వారా కూడా రూ. 71,900 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. దీనిపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌తో కూడిన తగ్గింపుతో మొత్తం రూ. 8వేల వరకు పొందవచ్చు. అంటే.. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 ఉండగా.. ఈ ఆఫర్‌తో భారీ తగ్గింపును పొందవచ్చు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌లను అందిస్తున్నప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లు, అమెజాన్ ప్రారంభ తగ్గింపును అందిస్తున్నాయి. మరోవైపు, ఐఎన్‌వెంట్ స్టోర్ క్యాష్‌బ్యాక్ స్కీమ్ కింద ఆపిల్ నిర్దిష్ట రిటైల్ ధర నుంచి లైవ్ మార్క్‌డౌన్‌గా నిలుస్తుంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ నుంచి వచ్చిన ఫోన్లలో ఐఫోన్ 15 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఐఫోన్ టైటానియం అల్లాయ్ ఫ్రేమ్, 6.1-అంగుళాల లేదా 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, శక్తివంతమైన ఎ16 బయోనిక్ చిప్‌తో కూడిన కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్‌లో 4ఎక్స్ రిజల్యూషన్‌తో కొత్త 48ఎంపీ ప్రధాన కెమెరా, అలాగే 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపీ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌తో ఐఫోన్ 15 యూఎస్‌బీ 3.2 జెనరేషన్ 5కి కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Xiaomi 14 Ultra Battery : షావోమీ 14 అల్ట్రా ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే బ్యాటరీ వివరాలు లీక్..!