Apple iPhone 15 Series : వచ్చే సెప్టెంబర్‌లోనే ఆపిల్ ఐపోన్ 15 సిరీస్.. లాంచ్ డేట్, ప్రీ-ఆర్డర్ సేల్ ఎప్పుడంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Apple iPhone 15 Series : ఆపిల్ కంపెనీ వచ్చే సెప్టెంబర్‌లో iPhone 15 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. లేటెస్ట్ డిజైన్, మెరుగైన పర్ఫార్మెన్స్, ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో అద్భుతమైన కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. జనరేషన్‌తో పోలిస్తే.. కొత్త మోడళ్ల ధరలు ఎక్కువగా ఉండవచ్చు.

Apple iPhone 15 Series may launch in third week of September, everything we know so far

Apple iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ (iPhone 15) సిరీస్ నుంచి ఐఫోన్ 15 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తేదీని ఎట్టకేలకు నిర్ణయించింది. లేటెస్ట్ రుమర్ల ప్రకారం.. ఆపిల్ సెప్టెంబర్ మూడో వారంలో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఆపిల్ ఉద్యోగులు ఒకేసారి సెలవులు తీసుకోవద్దని కూడా కంపెనీ సూచించినట్టు నివేదిక తెలిపింది. 9to5 Mac ప్రకారం.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్‌పై హింట్ ఇచ్చింది.

మొబైల్ క్యారియర్లు తమ ఉద్యోగులకు సెప్టెంబర్ 13న ఎలాంటి సెలవు తీసుకోవద్దని సూచించింది. అంటే.. ఇదే సమయంలో ఆపిల్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా, ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలోనూ, ఆపిల్ సాధారణంగా మంగళవారం తన ఐఫోన్‌లను ప్రకటించింది. గత ఏడాది ఈవెంట్ ట్రెండ్‌ను అనుసరించి సెప్టెంబర్ 7న (బుధవారం) జరిగింది. 2023 ఏడాదిలో సెప్టెంబర్ 13 (బుధవారం) కూడా వస్తుంది. ఆపిల్ స్పెషల్ లాంచ్ ఈవెంట్ ఇదే రోజు కావచ్చు.

Read Also : iPhone 14 Big Discount : అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కొనాలా వద్దా? ఐఫోన్ 15 కోసం ఆగాలా?

పుకార్లు నిజమైతే.. ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15 శుక్రవారం నుంచి ప్రారంభం కావచ్చు. అధికారిక లాంచ్ సెప్టెంబర్ 22న షెడ్యూల్ అయింది. గత ఏడాదిలో iPhone 14 ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌లు సెప్టెంబర్ 16న స్టోర్‌లకు చేరాయి. అయితే, సరఫరా సమస్యల కారణంగా అక్టోబర్ 7న ఐపోన్ 14 ప్లస్ ఆలస్యంగా లాంచ్ అయింది.

ఐఫోన్ 15 సిరీస్ కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే చుట్టూ కొద్దిగా కర్వడ్ ఎడ్జ్, సన్నని బెజెల్స్‌తో లేటెస్ట్ డిజైన్‌ను సూచిస్తున్నాయి. అలాగే, 4 కొత్త మోడల్‌లు సాధారణ లైట్నింగ్ కనెక్టర్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్‌లను కలిగి ఉండవచ్చు. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్‌లను సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్ స్థానంలో కొత్త టైటానియం ఫ్రేమ్ అందించనుంది.

Apple iPhone 15 Series may launch in third week of September, everything we know so far

హుడ్ కింద, ఐఫోన్ 15, 15 ప్లస్‌లు ఐఫోన్ 14 ప్రో మాదిరిగానే A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. అయితే, ఐఫోన్ 15 Pro, 15 Pro Max కొత్త A17 చిప్‌ను అందించనున్నాయి. అదనంగా, పెద్ద ప్రో మోడల్ కొత్త పెరిస్కోప్ లెన్స్‌తో రావచ్చు. ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు మెరుగైన ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను అందిస్తోంది.

ఈ అప్‌డేట్‌లతో ప్రస్తుత జనరేషన్‌తో పోలిస్తే.. కొత్త ఐఫోన్‌ల ధరలు 200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్, ఇతర ఫీచర్లపై అధికారిక ప్రకటనకు డై-హార్డ్ ఆపిల్ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు దగ్గరలోనే ఉండటంతో టెక్ ఔత్సాహికులు, ఆపిల్ నుంచి సరికొత్త అత్యుత్తమమైన వాటిని పొందేందుకు ఆసక్తిగా ఉన్న యూజర్లలో ఉత్సాహం పెంచుతోంది.

Read Also : OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డీల్స్, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు