Apple iPhone 16 : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ 16 ఇంత తక్కువా? ఇలా కొన్నారంటే రూ. 14,285 సేవ్ చేయొచ్చు..
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 14,285 వరకు ఆదా చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- August 21, 2026 / 10:15 AM IST
Apple iPhone 16 Cheapest Price
- ఆపిల్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్
- క్రెడిట్ కార్డులపై రూ. 5వేల కన్నా ఎక్కువ క్యాష్‌బ్యాక్ ఆఫర్
- ఎక్స్చేంజ్ బోనస్‌గా అదనంగా రూ. 5వేలు తగ్గింపు
Apple iPhone 16 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్ ఇప్పుడు ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది.
తద్వారా ధర మరింత తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 16లో ఆపిల్ A18 చిప్‌సెట్, 48MP కెమెరా ఓఎల్ఈడీ (Apple iPhone 16) డిస్‌ప్లే ఉన్నాయి. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్‌ను అసలు వదులుకోవద్దు. పూర్తి ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 16 డీల్స్ :
128GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,990గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.65,900కే లభిస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ.5,195 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అసలు ధరపై రూ.9,285 ఆదా చేయొచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.5వేలు బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో మొత్తంగా రూ.14,285 ఆదా చేసుకోవచ్చు.
Read Also : Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. iOS26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఆపిల్ ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ ఎఫ్/1.6 అపర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ఎఫ్/1.6 అపర్చర్‌తో 12MP 2x టెలిఫోటో కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఎఫ్/1.9 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఐఫోన్ 16 పొడవు 147.6మిమీ, వెడల్పు 71.6మిమీ మందం 7.8మిమీగా ఉంది. ఈ ఫోన్ బరువు 170 గ్రాములు ఉంటుంది.
