Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Nothing Phone 3 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అసలు ధర రూ.79,999 నుంచి ఏకంగా రూ.49,999కి తగ్గింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్, ఈఎంఐ ఎక్స్ఛేంజ్ డీల్‌తో ఇంకా డబ్బులు చేసుకోవచ్చు.

Nothing Phone 3 : కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. నథింగ్ ఫోన్ 3పై ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. లాంచ్ సమయంలో రూ.79,999గా ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.49,999కే దొరుకుతోంది. అంటే.. ఏకంగా రూ.30వేలు తగ్గింపు అన్నమాట.

అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొంటే మరో రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు నథింగ్ ఫోన్ ధర రూ.48,499కే వస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే మోడల్, కండిషన్‌ను బట్టి గరిష్ఠంగా రూ.34,050 వరకు అదనపు బెనిఫిట్ పొందవచ్చు.

ఈ ఫోన్లో ఏముంది? :
నథింగ్ ఫోన్ 3లో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10 ప్లస్ సపోర్ట్‌తో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటాయి. గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. దాంతో మీరు ఎండలోనూ కూడా ఫోన్ స్క్రీన్ చూడటం చాలా ఈజీ.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్, యాప్స్, గేమ్స్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్ ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటుంది.

ఇందులో పెరిస్కోప్ టెలిఫోటో, అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5,500mAh బ్యాటరీతో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. బ్యాటరీ విషయంలో కూడా ఈ నథింగ్ ఫోన్ రోజువారీ వినియోగానికి అద్భుతమైన ఆప్షన్.

కొనాలా? వద్దా? :
రూ.79,999 ఫోన్ ఇప్పుడు రూ.49,999కి లభిస్తుంది. డీల్ పరంగా కచ్చితంగా ఆకర్షణీయమైన ఆఫర్. ముఖ్యంగా డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాలు అన్నింటినీ కోరుకునేవారికి నథింగ్ ఫోన్ 3 బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అయితే, కొనేముందు అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ వాల్యూ, ఈఎంఐ నిబంధనలు, స్టాక్ ఒకసారి చెక్ చేయడం మంచిది. ఆఫర్ లిమిటెడ్ టైమ్ ఉండొచ్చు ఆలస్యం చేస్తే డీల్ మిస్ అవ్వొచ్చు..
