Apple iPhone 16 : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ డోంట్ మిస్..!
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గింది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ ద్వారా కేవలం రూ. 66వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బెస్ట్ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో కేవలం రూ.65,900 ధరకు లభ్యమవుతుంది. 128GB మోడల్‌పై ఈ ధర తగ్గింపు అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 2024లో లాంచ్ కాగా బేస్ మోడల్ (128GB) ధర రూ. 79,900 నుంచి డిస్కౌంట్ ద్వారా రూ. 66వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. కానీ, ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్‌లు, రీసేలర్లు డిస్కౌంట్‌లతో ధర మరింత తగ్గింపు పొందవచ్చు. మీరు కొత్త ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది బెస్ట్ టైమ్.. ఐఫోన్ 16 సరసమైన ధరలో ఇలా కొనేసుకోవచ్చు.

ఐఫోన్ 16పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు : ప్రస్తుతం ఆపిల్ రీసెల్లర్ ఇమాజిన్ 128GB వేరియంట్‌ను రూ.69,990కు లిస్ట్ చేసింది. కొనుగోలుదారులు ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులతో రూ.4వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. యాడ్-ఆన్ బ్యాంక్ ఆఫర్లతో అసలు ధర రూ. 65,900కి తగ్గుతుంది. ఐఫోన్ లాంచ్ దగ్గర నుంచి అత్యల్ప ధరలలో ఇదొకటి. కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఎంచుకోవచ్చు. ఇందులో అదనపు వడ్డీ లేకుండా సరసమైన ధరకు నెలవారీ ఈవీఎంఐ రూ. 10,983 నుంచి ప్రారంభమవుతాయి.

హై-స్టోరేజ్ వేరియంట్ల ధరలివే : ఇమాజిన్ ప్రస్తుత జాబితా ప్రకారం 256GB వేరియంట్ ధర రూ. 79,900, 512GB వేరియంట్ ధర రూ. 99,900కు పొందవచ్చు. ప్రస్తుతం, ఈ వేరియంట్లలో రీసేలర్ల నుంచి అందుబాటులో ఉన్న అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఏవీ లేవు. ఫైనల్ ధర ముందు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఓసారి చెక్ చేయండి.

ఆన్‌లైన్‌లో డీల్స్ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా ఇతర అధీకృత రీసేలర్ల వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఐఫోన్ 16 కొనుగోలుపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు రావచ్చు. కార్డ్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. సిరామిక్ షీల్డ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఐఫోన్ 16 ఆపిల్ లేటెస్ట్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 3nm ప్రాసెస్‌పై 5-కోర్ GPU, 6-కోర్ CPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో వస్తుంది. అడ్వాన్స్ ఏఐ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ షూటర్, బ్యాక్ సైడ్ 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఐఫోన్ కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ IP68 రేటింగ్ ద్వారా మరింత ప్రొటెక్షన్ అందిస్తుంది. ఐఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
