×
Ad

iPhone 16 Plus : ఆఫర్ అదిరింది బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.21,500 డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసం..!

Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఈ కొత్త ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Plus

  • భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900 
  • విజయ్ సేల్స్‌లో ఐఫోన్ రూ.71,890కి లిస్టింగ్, నేరుగా ధర రూ.18,010 తగ్గింపు
  • హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 3,500 అదనపు డిస్కౌంట్

Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీరు ఐఫోన్ కొనాలని అనుకుంటే ఈ ఆఫర్ మీకోసమే.. విజయ్ సేల్స్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ రూ. 21,500 కన్నా భారీ తగ్గింపు లభిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.71,890కి లిస్ట్ అయింది. రూ.18,010 నేరుగా ధర తగ్గింపు పొందింది అలాగే, మీరు హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Vivo V50 5G : వావ్.. వండర్‌ఫుల్.. ఈ వివో 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 9వేలు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 16 ప్లస్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల ఫుల్ సూట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ప్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది.

అదనంగా, ఐఫోన్ 16 ప్లస్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌ కూడా ఉందవి. ఈ ఫోన్ సింగిల్ఛార్జ్‌పై 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.