Apple iPhone 16 Plus
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16 ప్లస్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. జియోమార్ట్ ఈ ఐఫోన్ 16 ప్లస్ అసలు రిటైల్ ధర రూ. 89,900 కన్నా రూ. 65,990 తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఏకంగా రూ. 25వేల ధర తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 64,990కు తగ్గుతుంది. ఇంతకీ ఈ ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఆఫర్, స్పెసిఫికేషన్లతో (Apple iPhone 16 Plus) పాటు ఎలా కొనుగోలు చేయాలి? అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్లస్ రూ.25వేలు ధర తగ్గింపు :
జియోమార్ట్ ఐఫోన్ 16 ప్లస్‌పై అత్యధిక డిస్కౌంట్లను అందిస్తోంది. 128GB స్టోరేజ్ మోడల్ గతంలో రూ.89,900గా ఉండేది. అయితే, ఇప్పుడు రూ.65,990కి అందుబాటులో ఉంది. నేరుగా ధర రూ.23,910 తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ ఈ మోడల్ ధరలను తగ్గించింది. జియోమార్ట్ కూడా ఐఫోన్ 16 ప్లస్ రూ. 79,900 కూడా తగ్గింపు ధరకే లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గింపు :
ఎస్బీఐ కో-బ్రాండెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్లెయిమ్ చేయవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. తద్వారా ఈ ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.64,990కి తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. జియోమార్ట్‌లో డిస్కౌంట్ ధరకే ఐఫోన్ కొనేసుకోవచ్చు.
ఈ డీల్ జియోమార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. దేశ మార్కెట్లో డెలివరీకి అందుబాటులో ఉంది. స్టాక్‌లు పరిమితంగా ఉండవచ్చు. పండుగ సీజన్ రద్దీ సమయంలో డిమాండ్ ఆధారంగా ధరలు మారవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 ప్లస్ అనేది ఆపిల్ లేటెస్ట్ డిజైన్ అప్‌గ్రేడ్, ఏఐ-సెంట్రలైజడ్ హార్డ్‌వేర్
ముఖ్య ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే
ప్రొటెక్షన్ : సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ ప్రొటెక్షన్, IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అల్యూమినియం ఫ్రేమ్.
పర్ఫార్మెన్స్ : A18 చిప్, 6-కోర్ CPU, 5-కోర్ GPU
iOS 18లో ఆపిల్ ఇంటెలిజెన్స్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఆప్టిమైజ్
యాప్, గేమింగ్ మెషిన్ లెర్నింగ్, స్పీడ్ పర్ఫార్మెన్స్
కెమెరా ఫీచర్లు : OISతో 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2x ఆప్టికల్-క్వాలిటీ టెలిఫోటో జూమ్
ఆపిల్ ఐఫోన్ లో-లైటింగ్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్
జూమ్, క్యాప్చర్ కోసం కొత్త ‘కెమెరా కంట్రోల్ బటన్
బ్యాటరీ, వినియోగం : 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
స్టోరేజ్ వేరియంట్లు : 128GB, 256GB, 512GB
కలర్ ఆప్షన్లు : బ్లాక్, వైట్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్
ఐఫోన్ 16 ప్లస్ కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 65,990కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, ఏఐ A18 చిప్ కోరుకునే వారికి అదిరిపోయే డీల్. ఐఫోన్ కొనాలంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.