Apple iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!

Apple iPhone 16 Price : ఐఫోన్ 16 తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో రూ. 17,901 ధరకే సొంతం చేసుకోవచ్చు.

1/6Apple iPhone 16 Price
Apple iPhone 16 Price : పండుగ సీజన్ వచ్చేసింది. దీపావళి పండగ సేల్ సందర్భంగా కొత్త ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ కొత్త ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 రూ. 17,901 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఐఫోన్ 16 మళ్లీ లభించదు.
2/6Apple iPhone 16 Price
ఎందుకంటే.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 16 ధర రూ.69,900కు లభిస్తోంది. అయితే, పండుగ సీజన్ సేల్ సమయంలో కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో సహా దాదాపు రూ.52,000కు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో ఐఫోన్ 16 ధర ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
3/6Apple iPhone 16 Price
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర : ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ.51,999కి లభిస్తుంది. అసలు ధర కన్నా రూ.17,901 ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ ధర కోసం యాక్సిస్ లేదా ఎస్బీఐ ఫ్లిప్‌కార్ట్ కార్డుల వంటి కొన్ని క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయొచ్చు. అది ఒక్కటే డీల్ కాదు. కస్టమర్లు ఈఎంఐలో ఐఫోన్ 16 కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. మీ పాత ఫోన్‌ను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, మీ స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా డిస్కౌంట్ వాల్యూ ఉంటుంది.
4/6Apple iPhone 16 Price
మీరు ఈ డీల్‌ను మిస్ అవ్వకూడదనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ లేదా ప్లస్ సభ్యత్వాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. అందరికీ 24 గంటల ముందుగానే అక్టోబర్ 10న ఈ డీల్‌ను యాక్సస్ చేయొచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లించడం ద్వారా ఆపిల్ కేర్ ప్లస్, ఇతర యాడ్-ఆన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు.
5/6Apple iPhone 16 Price
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 60hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పెద్ద OLED ప్యానెల్‌ అందిస్తుంది. ఈ ఐఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఐఫోన్ A18 చిప్‌సెట్, 8GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీని కలిగి ఉంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. iOS26పై రన్ అవుతుంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌తో 3561mAh బ్యాటరీతో వస్తుంది.
6/6Apple iPhone 16 Price
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 మోడల్ 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాను అందిస్తుంది. ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తుంది. కెమెరా కంట్రోల్ బటన్లు, విజువల్ ఇంటెలిజెన్స్‌ను కూడా అందిస్తుంది.