iPhone 16 Sale
iPhone 16 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఈ-కామర్స్ దిగ్గజం క్రోమా ఐఫోన్ 16పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ తగ్గింపు ధర అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం క్రోమా ఆన్‌లైన్ స్టోర్‌లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ డిస్కౌంట్ ధరకే లభ్యమవుతుంది.
ఐఫోన్ 16 కేవలం రూ. 37,990కు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఐఫోన్ ధర నేరుగా డిస్కౌంట్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్లపై ఆధారపడదని గమనించాలి. ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ డిస్కౌంట్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బోనస్‌లు ఉన్నాయి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
క్రోమాలో ఐఫోన్ 16 ధర ఎంత? :
ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ధర రూ. 69,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఐఫోన్ క్రోమా ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 66,990కి లభిస్తుంది. అదనంగా, SBI, IDFC, ICICI బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు తగ్గింపు లభిస్తుంది. అదనంగా, HDFC బ్యాంక్ కార్డులపై రూ. 7వేలు తగ్గింపు లభిస్తుంది. క్రోమాలో ఈ ఐఫోన్ ధర రూ. 59,990కు లభిస్తుంది.
రూ. 16వేల వరకు ఆదా :
ఐఫోన్ 16 కొనుగోలుపై ఏకంగా రూ. 16వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 37,990కే కొనుగోలు చేయొచ్చు. నివేదికల ప్రకారం.. క్రోమాలో మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మీకు రూ. 16వేల వరకు ఆదా అవుతుంది.
ఈ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 14 రిఫరెన్స్ తీసుకుంటే.. మీరు ఐఫోన్ 14 మోడల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫోన్‌కు ఈ వాల్యూ మారుతుంది. ఐఫోన్ 16 కేవలం రూ.43,990కి అందుబాటులో ఉంటుంది.
ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ :
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మాత్రమే కాకుండా క్రోమా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. ఈ బోనస్ రూ. 6వేల వరకు ఉండవచ్చు. అదే జరిగితే మీకు రూ. 37,990కు ఫోన్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బోనస్ వాల్యూ మీ లొకేషన్ డివైజ్ బట్టి మారుతుంది. బ్యాంక్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది.