Mobile Cover Heat : మీ మొబైల్ బ్యాక్ కవర్‌లో డబ్బు, ఏటీఎం, మెట్రో కార్డులు పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఫస్ట్ ఈ స్టోరీ చదవండి..!
Mobile Cover Heat : మొబైల్ బ్యాక్ కవర్‌లో డబ్బులు, ఏటీఎం కార్డులు ఉంచుతున్నారా? ఇలా ఎప్పుడూ చేయొద్దు.. మీ బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది? జాగ్రత్త..
Mobile Cover Heat
Mobile Cover Heat : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఫోన్‌కు బ్యాక్ కవర్ ఉందా? మీకు మొబైల్ బ్యాక్ కవర్‌లో డబ్బులు లేదా ఏటీఎం క్రెడిట్ కార్డులు ఉంచుకునే అలవాటు ఉందా? ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే ఇప్పుడే మానేయండి. చాలామంది వ్యాలెట్ మాదిరిగా డబ్బులను ఫోన్ బ్యాక్ కవర్‌లో ఉంచుకుంటారు. అవసరమైనప్పుడు డబ్బు లేదా కార్డ్ దానిని వెంటనే బయటకు తీయవచ్చు కదా అని భావిస్తుంటారు.
ఇలా చేయడం వల్ల మీ ఫోన్ (Mobile Cover Heat) వేడెక్కవచ్చు. నెట్‌వర్క్ సమస్యలు ఉండవచ్చు. మీ ఏటీఎం కార్డులు కూడా దెబ్బతినవచ్చు. ఈ అలవాటును వెంటనే వదులుకోవడం ఎంతైనా మంచిది. ఇలా మొబైల్ బ్యాక్ కవర్‌లో డబ్బులు, కార్డులు ఉంచుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫోన్ బ్యాక్ కవర్‌లో ఇవి ఉంచొద్దు :
చాలా మందికి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, మెట్రో కార్డులు లేదా 50, 100, 200, లేదా రూ. 500 నోట్లను ఫోన్ వెనుక కవర్‌లో ఉంచుకునే అలవాటు ఉంటుంది. కొందరు అత్యవసర పరిస్థితుల కోసం ఇలా చేస్తారు. కానీ ఇది మీ ఫోన్‌ను దెబ్బతీస్తుంది. వేసవిలో ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. మీ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఈ అలవాటు ఫోన్ పర్ఫార్మెన్స్ ప్రభావితం చేస్తుంది. మీ భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుంది.
ఫోన్ హీటింగ్ ఇష్యూ :
నివేదిక ప్రకారం.. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించినప్పుడు వేడెక్కుతుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు లేదా ఎక్కువసేపు ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేసినప్పుడు ఫోన్ ప్రాసెసర్ ఎక్కువసేపు పనిచేస్తుంది. హీట్ జనరేట్ అవుతుంది.
డబ్బు లేదా కార్డులను ఫోన్ వెనుక కవర్‌లో ఉంచితే హీట్ బయటకు రాదు. తద్వారా ఫోన్ మరింత వేడెక్కుతుంది. బ్యాటరీపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. హై హీటింగ్ ఫోన్‌ను దెబ్బతీస్తుంది. ఫోన్ లైఫ్ టైమ్ తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
నెట్‌వర్క్ సిగ్నల్ సమస్యలు :
చాలా స్మార్ట్‌ఫోన్‌లలో యాంటెన్నా పైభాగంలో ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా డబ్బును ఫోన్ వెనుక కవర్‌లో ఉంచడం వల్ల నెట్‌వర్క్ సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌కు ఆటంకం కలుగుతుంది. బ్యాంక్, మెట్రో కార్డులలోని చిప్ లేదా మాగ్నెటిక్ స్ట్రిప్ సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించవచ్చు.
తద్వారా మీకు రావాల్సిన కాల్స్ ఆగిపోతాయి. ఇంటర్నెట్ స్లో అవుతుంది. నెట్‌వర్క్ వీక్ అవుతుంది. మీ ఫోన్ వెనుక కవర్‌లో కార్డులు, డబ్బును ఉంచి నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటే.. అసలు కారణం కవర్ వెనుక ఉన్న కార్డులు, డబ్బు కావచ్చు.
ఏటీఎం కార్డులు, డబ్బు నష్టం :
ఫోన్ కవర్‌లో డబ్బు లేదా కార్డులను ఉంచకూడదు. అత్యంత ప్రమాదకరం.. మీ ఫోన్ నుంచి వచ్చే వేడి వల్ల కవర్‌లో ఉంచి కరెన్సీ నోట్స్ వంగిపోవచ్చు లేదా చిరిగి పోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లోని మాగ్నెటిక్ స్ట్రిప్ కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.
