iPhone 16: ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 16, ఐఫోన్ 16ఈలో ఏది బెటర్?

ఈ రెండు ఐఫోన్లలోని ప్రత్యేకతలను చూస్తే తెలుస్తుంది.

iPhone 16

ఆపిల్ తన ఐఫోన్ 16 లైనప్‌లో ఐఫోన్ ఎస్‌ఈని కాకుండా ఐఫోన్ 16ఈని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ధర రూ. 59,900. ఇది స్టాండర్డ్‌ ఐఫోన్ 16 కంటే రూ.20,000 తక్కువ. ఈ ఏడాది ఆపిల్ ఫోన్లను కొనాలనుకుంటున్న వారు ఐఫోన్ 16, ఐఫోన్ 16eపై దృష్టి పెట్టారు. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్? ఈ రెండు ఐఫోన్లలోని ప్రత్యేకతలను చూస్తే తెలుస్తుంది.

వీటి మధ్య తేడా ఏంటి? 
ఐఫోన్ 16e, ఐఫోన్ 16 ఒకే సైజులో 6.1-అంగుళాల OLED డిస్ప్లేలతో విడుదలయ్యాయి. ఐఫోన్ SE లైనప్‌లోని ఎల్‌సీడీ స్క్రీన్‌లు చిన్నగా ఉండేవి. ఐఫోన్‌ 16ఈలో మాత్రం వీటిని అప్‌గ్రేడ్‌ చేశారు. 16e డిస్ప్లే డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌ సపోర్టుతో వచ్చింది.

ఐఫోన్ 16e స్క్రీన్ 1,200 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో వస్తుందని ముందుగా భావించారు. కానీ, అది 1,525 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో పనిచేస్తోంది. అంటే ఇది సాధారణ ఐఫోన్ 16 అంతటి బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుండడం గమనార్హం. అంతేగాక, ఐఫోన్ 16 కంటే ఐఫోన్ 16e తక్కువ ధరకు వస్తుంది.

Also Read: ఇందులో బౌలర్‌ చేసింది ఏముంది? అతడికి ఎందుకు శిక్ష?: వరుణ్ చక్రవర్తి

ఐఫోన్ 16e దాని ఫేస్ ఐడీ సిస్టమ్ లో నాచ్ డిజైన్‌తో వచ్చింది. అయితే ఐఫోన్ 16 మరింత ఆధునిక డైనమిక్ ఐలాండ్‌తో విడుదలైంది. ఈ రెండు ఐఫోన్‌లు క్లాసిక్ మ్యూట్ స్లయిడర్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌తో వచ్చాయి. ఇది కెమెరా, ఫ్లాష్‌లైట్ లేదా కస్టమ్ షార్ట్‌కట్‌లు వంటి ఫీచర్‌లను వేగంగా యాక్సెస్‌ చేసేలా ఉంది.

ఈ రెండు మోడల్‌లు 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చాయి. నాన్-ప్రో ఐఫోన్ 17 మోడల్‌లు మాత్రం 120Hzతో రావచ్చు. ఐఫోన్ 16e బ్యాటరీ పనితీరు ఐఫోన్ 16 కంటే మెరుగ్గానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఐఫోన్ 16e 26 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అంటే సాధారణ ఐఫోన్ 16 కంటే 4 గంటలు ఎక్కువగా వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఐఫోన్ 16e బ్యాటరీ సామర్థ్యం బాగానే ఉంటుంది కాబట్టి దీన్ని కొనుక్కోవచ్చు.

ఐఫోన్ 16e ధర రూ. 59,900, అయితే సాధారణ ఐఫోన్ 16 ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 16e కొంటే మీకు రూ.20,000 ఆదా అవుతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా ఐఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి ఐఫోన్ 16e మంచి ఆప్షన్. ధర రూ.20,000 ఎక్కువైనా పర్లేదని భావించే వాళ్లు ఐఫోన్ 16 కొనుక్కోవచ్చు.