IPL 2025: ఇందులో బౌలర్‌ చేసింది ఏముంది? అతడికి ఎందుకు శిక్ష?: వరుణ్ చక్రవర్తి

దాన్ని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీ హిట్‌ ఇవ్వడం ఏంటని నిలదీశాడు.

IPL 2025: ఇందులో బౌలర్‌ చేసింది ఏముంది? అతడికి ఎందుకు శిక్ష?: వరుణ్ చక్రవర్తి

PIC: @BCCI

Updated On : April 18, 2025 / 5:19 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా గురువారం ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మధ్య వాంఖ‌డే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కీపర్‌ ఎంసీసీ 27.3 కోడ్‌ను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. ముంబై ఏడో ఓవ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జీషన్‌ అన్సారీ బౌలింగ్ వేస్తున్నాడు.

ఆ సమయంలో 5వ బాల్‌కి బ్యాటర్ ర్యాన్ రికెల్‌టన్ షాట్ కొట్టగా ఆ బాల్‌ పాట్ క‌మిన్స్ చేతికి చిక్కింది. అయితే, ఆ సమయంలో వికెట్ కీపర్ హెన్రిచ్ గ్లవ్స్‌ ను స్టంప్స్‌ ముందుకు తీసుకువచ్చాడు. ఎంసీసీ 27.3 కోడ్‌ ప్రకారం ఇలా చేయకూడదు. దీంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు.

Also Read: ఆర్సీబీ కెప్టెన్‌పై బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?

ర్యాన్ రికెల్‌టన్ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే, ఇందులో బౌలర్‌ జీషన్‌ అన్సారీ తప్పు ఏముందని, అతడిని శిక్షించడం ఏంటని మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి అంటున్నాడు. ఎక్స్‌లో వరుణ్ చక్రవర్తి స్పందిస్తూ.. వికెట్ కీపర్ గ్లవ్స్‌ ఒకవేళ స్టంప్స్‌ ముందుకు వస్తే డెడ్‌బాల్‌గా ప్రకటించాలని అన్నాడు.

అనంతరం ఈ విషయంపై వికెట్ కీపర్‌ను హెచ్చరించాలని తెలిపాడు. అంతేగానీ, దాన్ని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీ హిట్‌ ఇవ్వడం ఏంటని నిలదీశాడు. బౌలర్‌ పొరపాటు లేనప్పుడు నోబాల్, ఫ్రీ హిట్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. దీని గురించి ఆలోచించాలని అన్నాడు.