ఆర్సీబీ కెప్టెన్‌పై బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?
ఆ జట్టు ఖాతాలో మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి.

Pic: @BCCI
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రజత్ పటీదార్‌పై ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఓ ఇంటర్వ్యూలో భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ.. రజత్ పటీదార్ చాలా ప్రశాంతంగా ఉంటాడని తెలిపాడు.
అతడికి తిరుగేలేదని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అతడు స్థిరంగా ఉంటాడని భువనేశ్వర్ చెప్పాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అలా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుందని తెలిపాడు. క్రికెటర్లలో కొందరు మ్యాచ్ ఓడిపోతే చాలా కంగారు పడతారని, రజత్ పటీదార్ మాత్రం ప్రశాంతంగానే ఉంటాడని చెప్పాడు.
KL Rahul: మొట్టమొదటిసారి కుమార్తె ఫొటోను పోస్ట్ చేసిన కేఎల్ రాహుల్.. సమంత రిప్లై..
ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ 2 మ్యాచుల్లో ఓడిపోయిందని ఆ సమయంలోనూ రజత్ స్థిరంగా ఉన్నాడని, మ్యాచ్ గెలిచినా అలాగే ఉంటాడని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. దీంతో జట్టులోని మిగతా ప్లేయర్లపై కూడా ఒత్తిడి ఉండదని చెప్పాడు. అతడే అన్ని విషయాలను హ్యాండిల్ చేసే తీరు అద్భుతమని తెలిపాడు.
బ్యాటింగ్/బౌలింగ్‌లో మార్పులు చేయాలనుకున్న సమయంలో అతడు సందేహించకుండా ఆ పని చేస్తాడని చెప్పాడు. కాగా, పాయింట్ల పట్టికలో ఆర్సీబీ శుక్రవారం మధ్యాహ్నం నాటికి మూడో స్థానంలో ఉంది. మొత్తం ఆ జట్టు 6 మ్యాచులు ఆడగా, నాలుగు మ్యాచుల్లో గెలిచింది. మరో రెండు మ్యాచుల్లో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి.