×
Ad

Apple iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోందోచ్.. కెమెరా, ధర, డిజైన్ లీక్..!

Apple iPhone 17 Air : ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది. ఈ ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Apple iPhone 17 Air

Apple iPhone 17 Air : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌తో (Apple iPhone 17 Air) కొత్త మోడల్‌ వస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also : EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌ వడ్డీ రేటుపై కేంద్రం కీలక ప్రకటన.. ఈసారి ఎంతంటే?

లీక్‌ల ప్రకారం.. కంపెనీ ఐఫోన్ 17 ఎయిర్ అనే సరికొత్త మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ఈ కొత్త మోడల్ ప్రస్తుత ప్లస్ వేరియంట్‌ స్థానంలో రానుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను అల్ట్రా మోడల్‌ స్థానంలో కూడా వచ్చే అవకాశం ఉందని పుకార్లు సూచిస్తున్నాయి.

అదే నిజమైతే.. రాబోయే ఐఫోన్ 17 సిరీస్‌లో మొత్తం 4 మోడళ్లు ఉంటాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 అల్ట్రా. ఇందులో ఐఫోన్ 17 ఎయిర్ ఎక్కువగా పాపులర్ అవుతోంది.

ఎందుకంటే ఇప్పటివరకు అత్యంత సన్నని ఐఫోన్ ఇదే కానుంది. ఐఫోన్ 17 ఎయిర్ కు సంబంధించి ఇప్పటివరకూ తెలిసిన వివరాలను ఓసారి లుక్కేయండి.

ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్, స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా-స్లిమ్ బాడీతో కొత్త డిజైన్‌ను కలిగి ఉండొచ్చు. కేవలం 6 మి.మీ మందంగా ఉండవచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 కన్నా చాలా సన్నగా 7.8 మిమీ ఉండొచ్చు. ఈ డిజైన్ ఐఫోన్ 17 ఎయిర్‌ ఇతర ఐఫోన్లలో కన్నా స్పెషల్ అని చెప్పొచ్చు.

ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ 120Hz సపోర్టుతో 6.6-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 48MP మెయిన్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉండొచ్చు.

ఫ్రంట్ సైడ్ 24MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ప్రస్తుత మోడళ్ల కన్నా పెద్దదిగా ఉండొచ్చు. హుడ్ కింద ఐఫోన్ ఆపిల్ A19 చిప్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు, దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 8GB ర్యామ్‌తో రావచ్చు. ఇన్-హౌస్ Wi-Fi చిప్‌ను చేర్చే అవకాశం ఉంది.

భారత్‌లో ఐఫోన్ 17 ఎయిర్ ధర (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17పై ఎలాంటి అధికారిక ధరలను వెల్లడించలేదు. ప్రస్తుత ప్లస్ మోడల్ కన్నా ఐఫోన్ 17 ఎయిర్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Read Also : Airtel Prepaid Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ ఇదిగో.. అన్ లిమిటెడ్ 5G హైస్పీడ్ డేటా..!

భారత మార్కెట్లో దాదాపు రూ. 95వేల ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అధికారిక లాంచ్ సమయంలోనే కచ్చితమైన ధర వెల్లడయ్యే అవకాశం ఉంది.